రక్తదానానికి యువత ముందుకు రావాలి

ABN , First Publish Date - 2021-06-14T05:30:00+05:30 IST

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 14: రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవరణలో రెడ్‌క్రాస్‌ సంచార రక్త సేకరణ వాహనం ద్వారా నిర్వహించిన

రక్తదానానికి యువత ముందుకు రావాలి
కార్పొరేషన్‌ ఆవరణలోని రెడ్‌క్రాస్‌ సంచార వాహనంలో రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పిలుపు 

కార్పొరేషన్‌ (కాకినాడ), జూన్‌ 14: రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సోమవారం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆవరణలో రెడ్‌క్రాస్‌ సంచార రక్త సేకరణ వాహనం ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కరోనా కారణంగా ఎన్నడూలేని విధంగా రక్తం కొరత ఏర్పడిందన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఆరోగ్యకరంగా ఉన్న యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. రక్తదాన శిబిరంలో కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌ పుండ్కర్‌, హెల్తాఫీసర్‌ పృఽఽథ్వీచరణ్‌, మేనేజర్‌ కె.సత్యనారాయణ రక్తదానం చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ రక్తదాన వారోత్సవాల్లో భాగంగా అన్ని వార్డు సచివాలయాల వద్ద రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామన్నారు. రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ వైడీ రామారావు మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ కలెక్టర్‌ ఆదర్శంగా నిలిచారని, యువత వారిని స్ఫూర్తిగా తీసుకుని రక్తదానానికి ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగ నరసింహరావు, డాక్టర్‌ పి.దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-14T05:30:00+05:30 IST