‘అపోహలు వీడి రక్తదానం చేయాలి’

ABN , First Publish Date - 2020-10-20T06:31:58+05:30 IST

అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాష్ట్ర, కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.

‘అపోహలు వీడి రక్తదానం చేయాలి’

ఘట్‌కేసర్‌: అపోహలు వీడి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రాష్ట్ర, కార్మిక ఉపాధి కల్పనా శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఘట్‌కేసర్‌లోని శివారెడ్డిగూడ బందన్‌ ఫంక్షన్‌హాల్‌లో జనహిత సేవా ట్రస్ట్‌, ఘట్‌కేసర్‌ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణం పోస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసు వ్యవస్థ నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 5 లక్షల కెమెరాలు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్లు తెలిపారు. మరో 5లక్షల కెమెరాలను అమర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.


రక్తదాన శిబిరంలో 150 మంది యువకులు పాల్గొన్నారు. గాంధీ ఆసుపత్రి బృందం రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో ఏసీపీ శ్యాంప్రసాద్‌, ఇన్‌స్పెక్టర్‌ చంద్రబాబు, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ కొండల్‌రెడ్డి, వైస్‌చైర్మన్లు మాధవరెడ్డి, నానావత్‌ రెడ్డియా నాయక్‌, బోడుప్పల్‌ మేయర్‌ బుచ్చిరెడ్డి, రైతుబంధు కమిటీ అధ్యక్షులు కొంతం అంజిరెడ్డి, నాయకులు బి.శ్రీనివా్‌సగౌడ్‌, జంగయ్య యాదవ్‌, ప్రభాకర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, జి.మహేష్‌, హరిశంకర్‌, ఆంజనేయులు, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T06:31:58+05:30 IST