రక్త సేకరణలో జాగ్రత్తగా ఉండాలి: ఎన్‌బీటీసీ

ABN , First Publish Date - 2020-04-10T08:07:25+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రక్త సేకరణలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలకు, రాష్ట్రాల బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ కౌన్సిళ్లను నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌...

రక్త సేకరణలో జాగ్రత్తగా ఉండాలి: ఎన్‌బీటీసీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి నేపథ్యంలో రక్త సేకరణలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాల ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలకు, రాష్ట్రాల బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ కౌన్సిళ్లను నేషనల్‌ బ్లడ్‌ ట్రాన్స్‌ఫ్యూజన్‌ కౌన్సిల్‌ డైరెక్టర్‌ ఆదేశించారు. రక్తదాన శిబిరాల వద్ద భౌతిక దూరం పాటించాలంటూ అన్ని రాష్ట్రాల సొసైటీలు, కౌన్సిళ్లకు మార్గదర్శకాలతో లేఖ రాశారు. కరోనా వైరస్‌ అనుమానితుల, బాధితుల నుంచి వెంటనే రక్తం సేకరించొద్దన్నారు. కరోనా వ్యాప్తి దేశాల నుంచి వచ్చిన వ్యక్తుల రక్తాన్ని 28 రోజుల వరకు సేకరించొద్దన్నారు. ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచే సేకరించాలని లేఖలో సూచించారు. రక్త సేకరణ సిబ్బంది చేతులకు గ్లౌవ్స్‌, హ్యాండ్‌ శానిటైజర్లు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి సందర్భంలో నాణ్యమైన రక్తాన్ని తగినంత అందుబాటులో ఉంచాలని సూచించారు.

Updated Date - 2020-04-10T08:07:25+05:30 IST