కడప, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): కడప నగరంలో ప్రభు త్వం నిర్ణయించిన సినిమా టి కెట్ల ధరలకు కడప నగరం లో మంగళం పలికారు. థియేటర్ యాజమాన్యం ఒక్కో టికెట్‌కు రూ.200కు విక్రయిస్తూ బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపింది. బ్లాక్ టికెట్ల విక్రయాన్ని అరికట్టాల్సిన రెవెన్యూ యంత్రాంగం థియేటర్ల యజమానులకు సలామ్ చేస్తోందని టీడీపీ నేత, ఉపాధి హామీ పఽథకం మాజీ కౌన్సిల్ సభ్యుడు పీరయ్య ఆరోపించారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేదవాడికి వినోదం ఖరీదుగా మారిందన్నారు.