కరోనా కంటే డేంజర్‌గా బ్లాక్ ఫంగస్ ముప్పు

ABN , First Publish Date - 2022-01-20T17:55:34+05:30 IST

కరోనా కంటే డేంజర్‌గా బ్లాక్ ఫంగస్ ముప్పు పొంచి ఉంది. తాజాగా మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి.

కరోనా కంటే డేంజర్‌గా బ్లాక్ ఫంగస్ ముప్పు

హైదరాబాద్ : కరోనా కంటే డేంజర్‌గా బ్లాక్ ఫంగస్ ముప్పు పొంచి ఉంది. తాజాగా మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. అవసరం లేకున్నా రోగులు స్టెరాయిడ్స్ వాడుతున్నారు. వాట్సాప్ వైద్యంతో డెల్టా వేవ్‌లో జోరుగా స్టెరాయిడ్స్‌తో ట్రీట్ మెంట్ చేసుకుని బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ రోగులు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. థర్డ్ వేవ్‌లో కరోనా ముప్పు తక్కువ ఉన్నా.. ముందస్తు జాగ్రత్తలతో స్టెరాయిడ్స్ వాడుతున్నారు. స్టెరాయిడ్స్ ఆపకపోతే బ్లాక్ ఫంగస్ ప్రమాదం తప్పదని వైద్యులు చెబుతున్నారు. 


Updated Date - 2022-01-20T17:55:34+05:30 IST