ఈ యుద్ధం ఉక్రెయిన్‌తో ఆగదు.. Putin అసలు టార్గెట్ ఇదే?!

ABN , First Publish Date - 2022-02-26T00:43:54+05:30 IST

ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా.. అక్కడితో ఆగదా? ఇతర దేశాలపై కూడా ఆధిపత్యం పొందే వరకూ వరకూ పుతిన్ నిద్రపోడా? ప్రపంచ శక్తిగా రష్యా రూపొందుతుందా? ఈ ప్రశ్నలకు వాంగా బాబా అవుననే

ఈ యుద్ధం ఉక్రెయిన్‌తో ఆగదు.. Putin అసలు టార్గెట్ ఇదే?!

ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా.. అక్కడితో ఆగదా? ఇతర దేశాలపై కూడా ఆధిపత్యం పొందే వరకూ వరకూ పుతిన్ నిద్రపోడా? ప్రపంచ శక్తిగా రష్యా రూపొందుతుందా? ఈ ప్రశ్నలకు వాంగా బాబా అవుననే చెబుతోంది. రష్యా అధ్యక్షుడు ప్రపంచాన్ని ఏలతాడంటూ వాంగా బాబా గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. ఇంతకూ వాంగా బాబా ఎవరు? రష్యా అధ్యక్షుడి గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటి అనే విషయాలను ఓసారి పరిశీలిస్తే.. 


తెలుగు రాష్ట్రాల్లో పోతులూరి వీరబ్రహ్మంగారు భవిష్యత్తు గురించి చెప్పిన మాటలను ఎంతలా విశ్వసిస్తారో.. బల్గేరియా ప్రజలు కూడా వాంగా బాబా చెప్పిన జోస్యాన్ని అంతే గట్టిగా నమ్ముతారు. 1911 ఏడాదిలో జనవరి 31న జన్మించిన ఈమె.. 12ఏళ్ల వయసులో ప్రకృతి విపత్తు వల్ల అనూహ్యంగా చూపు కోల్పోయారు. ఆ తర్వాత భవిష్యత్తు గురించి ఆమె ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అమెరికాలో జరిగిన 9/11 దాడులు, బ్రెగ్జిట్ వంటి విషయాలను కొన్నేళ్ల కిందటే ఆమె అంచనా వేశారు. అంతేకాకుండా అమెరికా 44వ అధ్యక్షుడిగా ఓ ఆఫ్రికన్ అమెరికన్ బాధ్యతలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఆమె చెప్పిన విధంగా బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడయ్యారు. ఇలా ఆమె చెప్పిన వాటిల్లో 85 శాతం జరగడంతో రష్యా గురించి ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 



‘‘రష్యా ‘లార్డ్ ఆఫ్ వరల్డ్’గా అవతరించబోతుంది. ఏదో ఒక రోజు వ్లాదిమిర్ పుతిన్‌ ప్రపంచాన్ని ఏలుతాడు. అప్పుడు ఆయన్ను ఆపడం ఎవరి తరం కాదు. యూరప్ బీడు భూమిగా మారబోతోంది. ప్రపంచంలోని అన్ని విషయాలు మంచు ముక్కలా కరిగిపోతాయి. కానీ వ్లాదమిర్ పుతిన్, రష్యా కీర్తిని ఎవరూ టచ్ చేయలేరు’’ అని వాంగా బాబా ఓ రైటర్‌తో చెప్పినట్టు బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ తాజాగా కథనాలు వెలువరించింది. ఉక్రెయిన్‌పై రష్యా ఇప్పటికే దాడులకు దిగింది. ప్రపంచ దేశాలు ఎంత హెచ్చరించినప్పటికీ పుతిన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రష్యా గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ గురించి వాంగా బాబా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిగ్‌గా మారాయి. 




Updated Date - 2022-02-26T00:43:54+05:30 IST