దీవించు

ABN , First Publish Date - 2021-10-15T07:45:57+05:30 IST

జన్మజన్మ సంచితాల కర్మలను పారద్రోలే జగజ్జననీ, ఆసేతుహిమాచలం నవనవోన్మేషయైన శోభలతో,...

దీవించు

జన్మజన్మ సంచితాల

కర్మలను పారద్రోలే

జగజ్జననీ,

ఆసేతుహిమాచలం

నవనవోన్మేషయైన శోభలతో,

అభయహస్తముద్రతో

భక్తులననుగ్రహించే

శక్తిస్వరూపిణీ,

లోకాలను కాపాడే

నిత్యసంతోషిణీ,

హరితభూములను హరించే

పర్యావరణ ద్రోహులను 

దునుమాడి,

ప్రజాకంటకుల

కుత్తుకలను త్రిశూలంతో

తెగనరికి,

రాజకీయ రాబందులకు

మంచి బుద్ధి నొసంగి,

సంతసాలను దూరంచేసే

విషవైరస్సుల బారినుండి

మము కాచు తల్లీ!

మా ఆనందములు

ఎల్లప్పుడూ

మాతో నిలుచునట్లు

దీవించుమమ్మా!

వేమూరిశ్రీనివాస్

తాడేపల్లిగూడెం

Updated Date - 2021-10-15T07:45:57+05:30 IST