బ్లీచింగ్‌పై.. జేసీ విచారణ

ABN , First Publish Date - 2020-05-30T09:26:10+05:30 IST

కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన బ్లీచింగ్‌, సున్నం, ఫినాయిల్‌, స్ర్పేయర్ల, హైపో క్లోరైడ్‌, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజుల పంపిణీ, కొనుగోళ్లలో జరిగిన

బ్లీచింగ్‌పై.. జేసీ విచారణ

స్ర్పేయర్ల కుంభకోణంపై దర్యాప్తు

పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఉత్తర్వులు

బ్లీచింగ్‌లో నాణ్యత 1.4 శాతమని నిర్ధారణ?


గుంటూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లాలోని గ్రామ పంచాయతీలకు సరఫరా చేసిన బ్లీచింగ్‌, సున్నం, ఫినాయిల్‌, స్ర్పేయర్ల, హైపో క్లోరైడ్‌, శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజుల పంపిణీ, కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కల్తీ బ్లీచింగ్‌, ఎక్కువ ధరలకు స్ర్పేయర్ల కొనుగోళ్లపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ప్రత్యేక కథనాలపై ప్రభుత్వం స్పందించింది.  ఈ క్రమంలో ఈ కుంభకోణంపై దర్యాప్తు చేయాలని జేసీ దినేష్‌ కుమార్‌ను ఆదేశించింది.


ఈ మేరకు పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరి, కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. బ్లీచింగ్‌ ఇతర పరికరాల బిల్లులు ఇవ్వాలని డీపీవో కార్యాలయాన్ని  జేసీ ఆదేశించారని సమాచారం. పంచాయతీలకు సరఫరా చేసిన బ్లీచింగ్‌లో నాణ్యత ప్రమాణాలు 1.4 శాతం ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. పిడుగురాళ్ల నుంచి పంపిణీ చేసిన బ్లీచింగ్‌లో నెల్లూరులో 1.5 శాతం, గుంటూరులో 1.4 శాతం ఉన్నట్లు తేలినట్లు సమాచారం. 


డీఎల్‌పీవో కార్యాలయంలో పరిశ్రమల కేంద్ర జీఎం

గుంటూరు డీఎల్‌పీవో కార్యాలయంలో నిల్వ చేసిన బ్లీచింగ్‌ బస్తాలను శుక్రవారం పరిశ్రమల కేంద్ర జీఎం పటేల్‌ పరిశీలించారు. వీటిని పరిశీలించిన ఆయన ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు. 

Updated Date - 2020-05-30T09:26:10+05:30 IST