Blast: టాటా స్టీల్‌ప్లాంట్‌లో భారీ పేలుడు, ఇద్దరికి గాయాలు
ABN , First Publish Date - 2022-05-07T20:44:18+05:30 IST
జార్ఖాండ్‌లోని జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ పేలుడు..
జంషెడ్పూర్: జార్ఖాండ్‌లోని జంషెడ్పూర్ టాటా స్టీల్ ప్లాంట్‌లో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ వర్కర్లు గాయపడ్డారు. కోక్ ప్లాంట్‌లో పేలుడు జరగడంతో ప్లాంట్ ఆవరణలో మంటలు చెలరేగినట్టు అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక శకటాల రంగంలోకి దిగి మంటలను అదుపు చేసిన్టటు చెప్పారు. ఈ ప్రమాదంలో ఎవరూ మృతి చెందలేదని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు.
కోక్ ప్లాంట్‌లోని బ్యాటరీ 6 వద్ద గ్యాస్ లైన్ వద్ద పేలుడు జరిగిందని, ప్రస్తుతం బ్యాటరీ 6లో ఎలాంటి ఆపరేషన్ జరగడం లేదని, డిస్మాంటలింగ్ ప్రోసెస్ జరుగుతోందని తెలిపారు. అగ్నిమాకపక శకటాలతో పాటు అంబెలెన్స్ కూడా ప్రమాద స్థలికి చేరుకున్నాయని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. గాయపడిన ఇద్దరు కాంట్రాక్టు వర్కర్లను చికిత్స కోసం టీఎంహెచ్‌కు తరలించామని, ఛాతీలో నొప్పిగా ఉన్నట్టు చెప్పడంలో మరో కార్మికుని కూడా అబ్జర్వేషన్ కోసం టీఎంహెచ్‌కు పంపామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరుగుపుతున్నామని అన్నారు. ఇదే టాటాస్టీల్ ప్లాంట్‌లో 2013 నవంబర్లోనూ పేలుడు జరగడంతో 11 మంది గాయపడ్డారు.