ఇమ్రాన్ ఖాన్‌పై దైవదూషణ కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

ABN , First Publish Date - 2022-05-03T01:00:23+05:30 IST

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తోపాటు మరో ఐదుగురిపై దైవదూషణ కేసు నమోదయ్యింది. పాక్ నూతన ప్రధాని షాబాజ్ షరీఫ్ గతవారం సౌదీఅరేబియా పర్యటనకు వెళ్లారు.

ఇమ్రాన్ ఖాన్‌పై దైవదూషణ కేసు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి Imran khanతోపాటు మరో ఐదుగురిపై దైవదూషణ కేసు నమోదయ్యింది.  Pakistan new PM Shehbaz Sharif  గతవారం సౌదీఅరేబియా పర్యటనకు వెళ్లారు. ముస్లీంలకు మక్కా తర్వాత అత్యంత పవిత్రమైన స్థలం మదీనాలోని Al-Masjid an-Nabawi మసీదును సందర్శించారు. అయితే ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌ మద్ధతుదారులు కొంతమంది పోకిరివేశాలు వేశారు. ప్రధాని షాబాజ్ షరీఫ్‌తోపాటు ఆయన బృందానికి వ్యతిరేకంగా మసీదులో పరుష పదజాలాన్ని వాడారు. దొంగలు, కుట్రదారులు అంటూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా నేరపూరిత భాష ఉపయోగించారు. దీంతో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పాక్ మాజీ అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ రషీద్, ఇమ్రాన్ వద్ద చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా పనిచేసిన షాబాజ్ గిల్‌తోపాటు ఇతరులపై పాక్‌లోని ఫైసలాబాద్‌లో దైవదూషణ కేసు నమోదయ్యింది. దైవదూషణ కేసులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టవుతారని పాక్ నూతన అంతర్గత వ్యవహారాల శాఖా మంత్రి రాణా సనావుల్లా తెలిపారు.


కాగా మదీనాలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ప్రధాన మంత్రి బృందానికి వ్యతిరేకంగా పరుష పదజాలం వాడినట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపించింది. నేరపూరిత భాష వాడారనే కారణంగా సౌదీ పోలీసులు ఐదుగురు పాకిస్తాన్ పౌరులను అరెస్ట్ చేశారని సౌదీ మీడియా పేర్కొంది. కాగా ఇమ్రాన్ ఖాన్ ఈ వివాదం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పవిత్ర స్థలం వద్ద నినాదాలు చేయాలని ఎవరికీ చెప్పే ఉద్దేశ్యం కూడా తనకులేదని అన్నారు.

Read more