Abn logo
Dec 5 2020 @ 23:07PM

వృద్ధులకు దుప్పట్లు పంపిణీ

తిర్యాణి, డిసెంబరు 5: మండలంలోని పండిగిమాదర, మార్కగూడ గ్రామాల పరిధిలో శనివారం వృద్ధులకు దుప్పట్లు, యువకులకు రాబిన్‌ హుడ్‌ ఆర్మీ సహకారంతో తిర్యాణి పోలీసులు రగ్గులు, వాలీబాల్‌ కిట్లను పంపిణీ చేశారు. ఆయా గ్రామాల పరిధిలోని పదిగూడెంలకు చెందిన 250 మంది వృద్ధులకు దుప్పట్లు, అయిదుగూడాల యువతకు వాలీబాల్‌ కిట్లు, 50 మంది యువతులకు శానిటరీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రెబ్బెన సీఐ సతీష్‌కుమార్‌ మాట్లాడారు. ఆదివాసీ యువత చదువుపై దృష్టి సారించాలని సూచించారు. క్రీడలకు పోలీసుల ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. త్వరలో గోలేటిలోని కానిస్టేబుల్‌ ఎంపిక పరీక్ష కోసం ఉచిత కోసింగ్‌ సెంటర్‌ ప్రారంబించనున్నట్లు తెలిపారు. ఆదివాసీ యువకులు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమం లో ఎస్సై రామారావు, సర్పంచ్‌ బాజ్జీరావు, రాధ, ఎంపీటీసీ కేశవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement