బ్లాక్‌స్టోన్‌ చేతికి ‘ఎంబసీ’ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌

ABN , First Publish Date - 2021-05-11T05:53:39+05:30 IST

భారత రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలో మరో భారీ డీల్‌ చోటు చేసుకుంది. ఎంబసీ గ్రూపునకు చెందిన ఎంబసీ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ను ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ బ్లాక్‌స్టోన్‌ కొనుగోలు...

బ్లాక్‌స్టోన్‌ చేతికి ‘ఎంబసీ’ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌

న్యూఢిల్లీ: భారత రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలో మరో భారీ డీల్‌ చోటు చేసుకుంది. ఎంబసీ గ్రూపునకు చెందిన ఎంబసీ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ను ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) సంస్థ బ్లాక్‌స్టోన్‌ కొనుగోలు చేసింది. ఈ డీల్‌ విలువ రూ.5250 కోట్లు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.  ఎంబ సీ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ ఈక్విటీలో ఎంబసీ గ్రూపుకు 30 శాతం, పీఈ సంస్థ వార్‌బర్గ్‌ పిన్‌క్‌సకు 70 శాతం వాటా ఉంది. ఈ రెండు సంస్థల నుంచి బ్లాక్‌స్టోన్‌ ఈ వాటాలను కొనుగోలు చేసింది. ఎంబసీ గ్రూపు  ఎంబసీ ఇండస్ట్రియల్‌ పార్క్స్‌ పేరుతో హైదరాబాద్‌, బెంగళూరు, పుణె, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో 2.2 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గిడ్డంగులు నిర్మిస్తోంది. 


Updated Date - 2021-05-11T05:53:39+05:30 IST