అశ్లీల ఫొటోతో విద్యార్థినికి Blackmail

ABN , First Publish Date - 2021-11-29T17:04:01+05:30 IST

అమెరికాలో చదువుతున్న ఓ విద్యార్థినికి అశ్లీల ఫొటో పంపించి, రూ.1.8 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేసిన చెన్నై పోరూర్‌ వాసిని నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ అంశానికి సంబంధించి

అశ్లీల ఫొటోతో విద్యార్థినికి Blackmail

రూ.1.8 కోట్లు డిమాండ్‌ చేసిన చెన్నై వాసి అరెస్టు 

చెన్నై: అమెరికాలో చదువుతున్న ఓ విద్యార్థినికి అశ్లీల ఫొటో పంపించి, రూ.1.8 కోట్లు ఇవ్వాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేసిన చెన్నై పోరూర్‌ వాసిని నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.  ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ అంశానికి సంబంధించి వివరాలిలా... స్థానిక కీల్పాక్కం ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని కుమార్తె అమెరికాలో చదువుతున్నారు. ఆమె మొబైల్‌కు ఇటీవల ఓ వ్యక్తి ఒక న్యూడ్‌ ఫొటోతో పాటు షార్ట్‌ మెసేజ్‌ పంపి, 2.50 యూఎస్‌ డాలర్లు (ఇండియన్‌ కరెన్సీలో రూ.1.8కోట్లు) ఇవ్వాలని లేకుంటే, ఈ ఫొటోను ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేసి అంతకంటే ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటామని బెదిరించాడు. ఆ విషయాన్ని తన తల్లి దృష్టికి తీసుకుని రాగా ఆమె టీపీసత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ చేపట్టి, నిందితుడిని చెన్నై, పోరూర్‌ ప్రాంతానికి చెందిన రమేష్‌ (51)గా గుర్తించారు. అతడ్ని అరెస్టు చేసి, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-11-29T17:04:01+05:30 IST