అందం అందంగా
ఎందుకులేదో ఎవరు చెప్పాలిలే
ఒక రంగు
మరో రంగుని ఎలా చూస్తుంది
వినగలమా రంగుల్ని
నిశ్శబ్దస్పర్శ
ఏ గాలితో తాకగలనో
నీడలు ఏ రంగులో తిరిగి కనిపిస్తాయ్
రుచిచూసే రూపంలేని రంగు
ఎలా ఉంటుందో
కలనీ
నిద్రనీ
దాటే ఆరని రంగు రంగుల రంగు
ఎప్పటికి తెలుస్తుంది
ఎం. ఎస్. నాయుడు