స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉన్న ఒక పుస్తక పేజీ ధర రూ.24 కోట్లు.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2022-01-18T09:56:55+05:30 IST

ఒక పుస్తకంలోని ఓకే ఒక్క పేజీ మాత్రమే కోట్టరూపాయలకు అమ్ముడైన విషయం ఎక్కడైనా విన్నారా?.. లేదు కదా. కానీ అలా జరిగింది. ఒక పుస్తకంలో ఒక్క పేజీ ఏకంగా రూ.24 కోట్లకు వేలంలో అమ్ముడైంది. ఏంటీ షాకింగ్ గా ఉంది కదా.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పుస్తకాలు భారీ ధరకు అమ్ముడవుతుంటాయి. కానీ ఓ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ అమ్ముడు కావటం అదికూడా కోట్ల రూపాయల ధర పలకటం...

స్పైడర్ మ్యాన్ బొమ్మ ఉన్న ఒక పుస్తక పేజీ ధర రూ.24 కోట్లు..  ఎందుకో తెలుసా?

ఒక పుస్తకంలోని ఓకే ఒక్క పేజీ మాత్రమే కోట్టరూపాయలకు అమ్ముడైన విషయం ఎక్కడైనా విన్నారా?.. లేదు కదా. కానీ అలా జరిగింది. ఒక పుస్తకంలో ఒక్క పేజీ ఏకంగా రూ.24 కోట్లకు వేలంలో అమ్ముడైంది. ఏంటీ షాకింగ్ గా ఉంది కదా.. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పుస్తకాలు భారీ ధరకు అమ్ముడవుతుంటాయి. కానీ ఓ పుస్తకంలో ఒకే ఒక్క పేజీ అమ్ముడు కావటం అదికూడా కోట్ల రూపాయల ధర పలకటం అత్యంత ఆశ్చర్యకరమైన విషయం అని వేరే చెప్పనక్కరలేదు.. ఏంటా పుస్తకం? ఆ పేజీ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..


అది 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకం. ఆ పుస్తకంలో ఓ పేజీ వేలంలో ఏకంగా రూ. 24 కోట్లకు అమ్ముడుపోయింది..!  స్పైడర్ మ్యాన్ అనేది కామిక్ పుస్తక చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరోల పాత్రలో ఒకటి. ఈనాటికి స్పైడర్ మ్యాన్ అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో క్రేజ్ క్రియేట్ చేసిన పాత్రగా కొనసాగుతునే ఉంది.


కామిక్ పుస్తకాల సుప్రసిద్ధ రచయితలైన స్టాన్ లీ, స్టీవ్ డిట్కోచే సృష్టించబడిన ఈ పాత్ర దశాబ్దాలుగా ఆదరణ పొందుతునే ఉంది. ఈ పేరు మీద వచ్చిన సినిమాలన్నీ హిట్లే. స్పైడర్ మ్యాన్ పేరొక్కటే చాలు. అది సినిమా అయినా, సిరీస్ అయినా.. ఆఖరికి అది పుస్తకమైనా పుస్తకంలో ఓ పేజీ అయినా సరే అనేలా 1984 నాటి సింగిల్ స్పైడర్ మ్యాన్ కామిక్ పుస్తకంలోని 25వ పేజీలో తొలిసారి బ్లాక్ స్పైడర్ మ్యాన్(black dress spider man) ఫొటో ప్రచురించబడింది. తొలిసారి స్పైడర్ మ్యాన్ నల్లరంగు ధరించి వినమ్‌తో పోరాడే కథ ముందుకు వచ్చింది. ఆ కాలంలో ఈ కామిక్ బుక్ క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఈ మధ్య అమెరికాలోని డల్లాస్‌లో బ్లాక్ స్పైడర్ మ్యాన్ ఫొటో ఉన్న పేజీని వేలం వేశారు. ఆ వేలంలో స్పైడర్ మ్యాన్ అభిమానులు దీనిని 3.36 మిలియన్ డాలర్లు(రూ.24 కోట్లు) పెట్టి కొన్నారు.


కొంతమంది తమకు ఇష్టమైన వ్యక్తుల వస్తువుల్ని సొంతం చేసుకోవాలని కోట్ల రూపాలు పెట్టి మరీ కొంటుంటారు. కొన్ని నెలల క్రితమే 40 ఏళ్లనాటి ఓ చిన్న కేక ముక్క అక్షరాలా రూ.30 లక్షలకుపైనే అమ్ముడైన విషయం తెలిసిందే. అలాగే ఓ ప్రముఖుడు ముక్కు నోరు తుడుచుకున్న ఓ టిష్యూ పేపర్ ఏకంగా రూ.705 కోట్లకు అమ్ముడుపోయి అందరినీ ఆశ్చర్య పరిచింది. అలా ప్రముఖులు, సెలబ్రిటీలు వాడిన వస్తువులు వేలంలో షాకింగ్ ధరకు అమ్ముడవుతుంటాయి.




Updated Date - 2022-01-18T09:56:55+05:30 IST