నల్ల బియ్యం మంచివేనా?

ABN , First Publish Date - 2020-12-18T17:41:18+05:30 IST

ఇటీవల ప్రధానమంత్రి ఓ ప్రసంగంలో నల్ల బియ్యం (బ్లాక్‌ రైస్‌) గురించి మాట్లాడారు. ఈ రంగు బియ్యం ఉపయోగాలేమిటి?

నల్ల బియ్యం మంచివేనా?

ఆంధ్రజ్యోతి(18-12-2020)

ప్రశ్న: ఇటీవల ప్రధానమంత్రి ఓ ప్రసంగంలో నల్ల బియ్యం (బ్లాక్‌ రైస్‌) గురించి మాట్లాడారు. ఈ రంగు బియ్యం ఉపయోగాలేమిటి?


- గౌరి, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: తెల్ల బియ్యానికి ప్రత్యామ్నాయాలుగా నేడు బ్రౌన్‌ రైస్‌, బ్లాక్‌ రైస్‌, పర్పుల్‌ రైస్‌, రెడ్‌ రైస్‌ ఇలా పలు రంగుల్లో లభిస్తున్నాయి. వివిధ రకాలైన పోషకాలు మిగతా రకాల బియ్యంలో కంటే బ్లాక్‌ రైస్‌లో ఎక్కువ. ఇందులోని ఆంథోసైయనిన్లు అనేవి యాంటీఆక్సిడెంట్లుగా, శరీరంలో ఉన్న కణజాలాల వాపును నియంత్రించే పదార్థాలుగా పనిచేస్తాయి. దీని వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గడమేగాక మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ వల్ల రక్త నాళాల్లో ఏర్పడే గడ్డలను కూడా తగ్గించి గుండె ఆరోగ్యానికి ఈ ఆంథోసైయనిన్లు ఉపయోగపడతాయి. పిండి పదార్థాల శోషణను బ్లాక్‌ రైస్‌లో ఉండే పీచు పదార్థం నియంత్రించి రక్తంలో చక్కర స్థాయిని కంట్రోల్‌ చేస్తుంది. బ్లాక్‌ రైస్‌ వల్ల పలు రకాల క్యాన్సర్‌ల నుండి రక్షణ పొందవచ్చు. ఈ ఆంథోసైయనిన్లు రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచి, డయాబెటీస్‌ రాకుండా కాపాడతాయి. ఫాటీ లివర్‌ డిసీజెస్‌ నుండి నల్ల బియ్యంలోని పోషకాలు రక్షణ కల్పిస్తాయి. ఇన్ని రకాల ఉపయోగాలున్నా మామూలు బియ్యం లాగా వీటిలోనూ పిండి పదార్థాలు అధికం. కాబట్టి ఎక్కువ తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంది.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)



Updated Date - 2020-12-18T17:41:18+05:30 IST