Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోషకాల నిధి ‘బ్లాక్‌ రైస్‌’!

బ్లాక్‌ రైస్‌ గురించి విన్నారా? ఒకప్పుడు ఇది సంపన్నుల ఇంటే ఉండేది. దీన్ని ‘ఫర్‌బిడన్‌ రైస్‌’ అని కూడా అంటుంటారు. చైనాలో ఈ రైస్‌ మూలాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు  ప్రపంచంలోని పలుదేశాల వంటకాల్లో దీన్ని బాగా వినియోగిస్తున్నారు.  వీటితో బోలెడు ఆరోగ్య సంబంధమైన లాభాలు ఉన్నాయి. అందుకే హెల్త్‌ కాన్షస్‌ ఉన్నవాళ్లు ఈ బియ్యాన్ని బాగా వాడుతుంటారు. ఈ బియ్యాన్ని వాడడం వల్ల మూత్రపిండాలు, కాలేయం, జీర్ణాశయం బాగా పనిచేస్తాయి. ఇందులో పీచుపదార్థాలు, పలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఎసెన్షియల్‌ ఎమినో యాసిడ్స్‌ కూడా నల్లబియ్యంలో ఎక్కువే. ఇంకా కాపర్‌, ఐరన్‌, థియామైన్‌, రెబోఫ్లావిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌ వంటి విటమిన్లు నల్ల బియ్యంలో బాగా ఉన్నాయి. ఈ బియ్యంలోని యాంటాక్సిడెంట్లు శరీరంలోని విషతుల్యమైన పదార్థాలతో శక్తివంతంగా పోరాడతాయి.


ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధిస్తాయి. నల్లబియ్యం తినడం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి కూడా బాగా పెరుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి  నల్ల బియ్యం ఎంతో ఉపయోగపడుతుంది. నల్ల బియ్యం వాడడం వల్ల అల్జీమర్స్‌, మధుమేహం, కేన్సర్‌ వంటి జబ్బులు రాకుండా నిరోధించవచ్చు. నల్లబియ్యంలోని యాంథోసియానిన్‌ అనే యాంటాక్సిడెంట్‌ వల్ల ఈ బియ్యంతో చేసిన వంటకాలు ఘుమఘుమలు చిందించడమే కాదు ఎంతో రుచిగా, నోరూరించేలా కూడా ఉంటాయి. ఇక బ్లాక్‌ రైస్‌తో చేసుకునే రెసిపీలకు కొదవే లేదు!!!Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...