Abn logo
Nov 29 2020 @ 01:03AM

త్వరలో...బ్లాక్‌పాంథర్‌ 2

మూడు నెలల కిత్రం హాలీవుడ్‌ నటుడు ఛాద్విక్‌ బోస్‌మన్‌ మృతితో ‘బ్లాక్‌పాంథర్‌’ చిత్రం పేరు వార్తల్లో నిలిచింది. బోస్‌మన్‌ మరణంతో ‘బ్లాక్‌పాంథర్‌’ సీక్వెల్‌ను చిత్ర నిర్మాణ సంస్థ మార్వెల్‌ స్టూడియో పక్కనపెట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ముందుగా ప్రకటించినట్టు ఈ చిత్రం సీక్వెల్‌ వచ్చే ఏడాది మార్చిలో కాకుండా జులైలో సెట్స్‌పైకి వెళ్లనుందని, అట్లాంటాలో షూటింగ్‌ ప్రారంభమవుతుందనీ, ఏకధాటిగా ఆరునెలల పాటు షూటింగ్‌ జరుపుకుంటుందని హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ సమాచారం. అయితే బోస్‌మన్‌ మృతితో రెండో భాగంలో టైటిల్‌ రోల్‌ ఎవరు పోషిస్తున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గాయని, నటి రిహాన్నా టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని మార్వెల్‌ స్టూడియో ప్రతినిధులు తెలిపారు. బోస్‌మన్‌ మరణంతో ఈ చిత్రం స్ర్కిప్ట్‌ మొత్తాన్ని మార్చేందుకు ప్రస్తుతం రచయితల బృందం పనిచేస్తోందట. 

Advertisement
Advertisement
Advertisement