ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన నల్లజాతీయుడిపై రెచ్చిపోయిన పోలీసులు..

ABN , First Publish Date - 2022-07-22T04:58:39+05:30 IST

ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడిన ఓ నల్లజాతీయుడిపై టెన్నెసీ రాష్ట్ర పోలీసులు రెచ్చిపోయారు.

ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన నల్లజాతీయుడిపై రెచ్చిపోయిన పోలీసులు..

ఎన్నారై డెస్క్: ట్రాఫిక్ ఉల్లంఘనకు(Traffic violation) పాల్పడిన ఓ నల్లజాతీయుడిపై(Black man) టెన్నెసీ(Tennessee) రాష్ట్ర పోలీసులు రెచ్చిపోయారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో అతడిని కొట్టడంతో(Beaten) మొఖంపై గాయాలయ్యాయి. ఓక్‌ల్యాండ్ పోలీసులు చేసిన నిర్వాకంపై ఆ రాష్ట్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ప్రారంభించింది. రెడ్ సిగ్నల్‌ను జంప్ చేసిన బ్రాండన్ కాలోవే అనే యువకుడిని పోలీసులు ఆగమన్నా ఆగకుండా పారిపోయాడు. ఈ క్రమంలో బ్రాండన్‌ ఓ ఇంట్లోకి దూసుకుపోయాడు. అతడి వెనుకే వెళ్లిన పోలీసులు అతడిని చితక్కొట్టారు. అంతేకాకుండా.. టేజర్ గన్నుతో అతడికి విద్యుత్ షాక్ ఇచ్చారు. 


ఇదంతా పోలీసుల దుస్తులకు అమర్చిన బాడీ కెమెరాలో రికార్డైంది. ఆగండి..ఆగండి.. అతడని ఎందుకలా కొడుతున్నారు అంటూ ఆ ఇంట్లోని మహిళ పోలీసులను ప్రశ్నిస్తున్న దృశ్యం కూడా కెమెరా కంటికి చిక్కింది. బ్రాండన్ వద్ద ఎటువంటి ఆయుధమూ లేదన్న విషయాన్ని కూడా ఆ మహిళ పోలీసులకు చెప్పే ప్రయత్నం చేయడం కెమెరాలో రికార్డైంది. ఇంతటి అసాధారణ రీతిలో నిరాయుధుడిపై బలప్రయోగం జరిగిన నేపథ్యంలో పోలీసు శాఖ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది.  

Updated Date - 2022-07-22T04:58:39+05:30 IST