బ్లాక్‌లో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు!

ABN , First Publish Date - 2021-05-13T05:24:30+05:30 IST

కరోనా ఎందరికో ప్రాణసంకటంగా ఉండగా మరికొందరికి ఆదాయ వనరుగా మారింది.

బ్లాక్‌లో రెమిడెసివర్‌ ఇంజక్షన్లు!
ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్న విజిలెన్స అధికారులు

విజిలెన్స ఆపరేషనలో వెలుగులోకి

ఇద్దరు వ్యక్తుల అరెస్టు


నెల్లూరు(క్రైం), మే 12: కరోనా ఎందరికో ప్రాణసంకటంగా ఉండగా మరికొందరికి ఆదాయ వనరుగా మారింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఒక్క ఇంజక్షన కోసం కరోనా రోగులు వెతుకుంటే ఆ అవసరాన్ని క్యాష్‌ చేసుకుంటున్నారు కొందరు రాబంధులు. విజిలెన్స అండ్‌ ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులు బుధవారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషనలో అధిక ధరలకు రెమిడెసివర్‌ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి వారి నుంచి ఇంజక్షన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. రెమిడెసివర్‌ ఇంజక్షన్లకు ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారన్న ఆరోపణలతో విజిలెన్స ప్రాంతీయ నిఘా అధికారి ఉత్తర్వుల మేరకు విజిలెన్సు అధికారులు ఆపరేషనలో భాగంగా తమకు ఇంజక్షన్లు కావాలని అనుమానితులు కాలంగి భవానీశంకర్‌, ఎస్‌కే కాసీమ్‌లను కోరారు. దాంతో వారు బేరసారాలు మాట్లాడుకుని ఇంజక్షన్లను అధక ధరకు విక్రయించేందుకు రావడంతో వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. పొగతోట ప్రాంతంలో కాలంగి భవానీశంకర్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఆరు ఇంజక్షన్లు, కారు, ఫోను, రూ.20వేల స్వాధీనం చేసుకున్నారు. భవానిశంకర్‌ న్యూరో ఫిజియాలిజిస్ట్‌గా మెడికవర్‌ వైద్యశాలలో పనిచేస్తున్నాడు. విజిలెన్స అధికారులకు ఒక్కో ఇంజక్షను రూ.23 వేలకు ఇచ్చేట్టుగా బేరం కుదుర్చుకున్నాడు. అలాగే బట్వాడిపాలెం సెంటర్‌ వద్ద ఎస్‌కే కాసీమ్‌ను అదుపులోకి తీసుకుని అతని నుంచి 3 ఇంజక్షన్లు, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన, రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. కాసీమ్‌ ఒక్కో ఇంజక్షను రూ.34వేలకు ఇచ్చేవిధంగా బేరం కుదుర్చుకున్నాడు. కాసీమ్‌ గతంలో మెడికల్‌షాప్‌లో పనిచేశాడు. ఇద్దరు వ్యక్తులను విజిలెన్స అధికారులు తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. ఈ ఆపరేషనలో విజిలెన్స ఇనస్పెక్టర్‌ వీ సుధాకర్‌రెడ్డి, డీసీటీవో విష్ణురావు, డ్రగ్‌ ఇనస్పెక్టర్‌, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంజక్షను రూ.3500 విక్రయించాలని నిర్ధేశిస్తే ఇలా వేలకు వేలు మధ్యవర్తులు అమ్ముకుంటున్నారు. అసలు వీరికి ఈ ఇంజక్షన్లు ఎవరు ఇచ్చారు, ఎక్కడ నుంచి ఇన్ని ఇంజక్షన్లు వీరికి వచ్చాయి అన్న విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. 

Updated Date - 2021-05-13T05:24:30+05:30 IST