Abn logo
Sep 21 2021 @ 01:22AM

కిడ్నీ, లంగ్స్‌పై బ్లాక్‌ఫంగస్‌ దెబ్బ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: ప్రపంచ వైద్యచరిత్రలోనే తొలిసారి.. బ్లాక్‌ఫంగస్‌ కారణంగా ఒక భారతీయుడికి కుడి మూత్రపిండాన్ని, ఎడమ ఊపిరితిత్తిలో కొంత భాగాన్ని వైద్యులు తొలగించారు. ఘజియాబాద్‌కు చెందిన 34 ఏళ్ల యువకుడు కరోనా బారిన పడి చికిత్స పొందాడు. ఆ తర్వాత అతడికి శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారింది. కళ్లెలో రక్తం పడడం ప్రారంభించింది.


తీవ్ర జ్వరం కూడా వస్తుండడంతో కుటుంబసభ్యులు అతణ్ని ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అతడికి వైద్యపరీక్షలు చేయగా.. బ్లాక్‌ఫంగ్‌సతో బాధపడుతున్నట్లు తేలింది. అయితే ఇతర పేషెంట్లకు సోకినట్టు కళ్లకుకాక.. మ్యూకర్‌ అతడి ఎడమ ఊపిరితిత్తిలో కొంతభాగానికి, కుడి మూత్రపిండానికి సోకినట్టు వెల్లడైంది. వైద్యులు  శస్త్రచికిత్స చేసి ఆ రెండు భాగాలనూ తొలగించారు.