అనుమతులు కొన్ని.. అడ్డదారిలో మరిన్ని...

ABN , First Publish Date - 2021-06-13T03:39:17+05:30 IST

అనుమతులు కొన్ని.. అడ్డదారిలో మరిన్ని...

అనుమతులు కొన్ని..  అడ్డదారిలో మరిన్ని...
ఇటీవల పోలీసులు పట్టుకున్న నకిలీ విత్తనాలు

బ్రాండ్ల పేరుతో కొన్ని విత్తన కంపెనీల మాయాజాలం  

ఓ కంపెనీ పేరుతో అనుమతి.. వేర్వేరు బ్రాండ్లతో విత్తనాలు

వేటికి అనుమతి ఉందో తెలుసుకోవడంలో ఇబ్బందులు

ఖమ్మం, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): విత్తన చట్టంలోని లొసుగులను అడ్డంపెట్టుకుని కొన్ని విత్తన కంపెనీలు అడ్డదారిలో అక్రమాలకు పాల్పడుతు న్నాయి. ఓ కంపెనీ పేరుతో వ్యవసాయశాఖ వద్ద అనుమతి పొంది దాని ద్వారా పలు రకాల(వెరైటీలు)లో విత్తనాల అమ్మకాలు సాగిస్తున్నా యి. దీంతో కిందిస్థాయిలో వ్యవసాయాధికారులు సైతం దేనికి అనుమతి ఉందో దేనికి లేదో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అనుమతులలో కంపెనీల పేరుంటే విత్తనాల బ్రాండ్‌లో పలు పేర్లు ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితి కూడా నకిలీ విత్తనాల విక్రయాలకు అవకాశం ఏర్పడుతోంది. ఈ క్రమంలో అసలు అనుమతులే తీసుకోకుండా ఉన్న కొన్ని బ్రాండ్ల నకిలీ విత్తనాలు ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోలీసులకు చిక్కుతున్నాయి. వ్యవసాయ సీజన్‌లో మిర్చి, పత్తితోపాటు పుచ్చ, పలురకాల కూరగాయల హైబ్రీడ్‌ విత్తనాలకు డిమాండ్‌ ఉంటుంది. దాంతో ఖరీదైన ఈ విత్తనాలను ఎలాంటి అనుమతులు లేకుండానే కొందరు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు వ్యవసాయశాఖ నుంచి కొన్ని కంపెనీలు అనమ తులు పొందగా, మరికొన్ని కంపెనీలు అనుమతి కోసం దరఖాస్తులు చేసుకున్నాయి. కానీ అనుమ తులు రాకముందే అవి తమ వ్యాపారం సాగిస్తున్నారు. కొందరు కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకుంటూ తిరిగి వ్యాపా రాలు నడిపిస్తున్నారు. ఇది వ్యవసాయశఖ అధికారులకు, రైతులకు క్షేత్రస్థాయిలో ఇబ్బందికరంగా మారింది. 

వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన కంపెనీలు  

రాష్ట్రంలో వ్యవసాయశాఖ నుంచి అనుమతి పొందిన పత్తి విత్తన కంపెనీలు 58 వరకు ఉన్నాయి. ఇవి పదిరోజుల కిత్రం అనుమతి పొందినవి కాగా, కొత్తగా మరికొన్నింటికి అనుమతి ఇచ్చారు. వీటికి సంబంధించిన సమాచారం జిల్లాకు ఇంకా అందలేదు. ఇక వ్యవసాయశాఖనుంచి రాష్ట్రంలో 36 హైబ్రిడ్‌ మిర్చి విత్తన కంపెనీలు అనుమతి పొందాయి, ఇవన్నీ పదిరోజుల క్రితంవరకు అనుమతి పొందగా కొత్తగా మరికొన్ని కంపెనీలు అనుమతి తీసుకున్నాయి. ఆ కంపెనీల వివరాలు ఇంకా జిల్లా వ్యవసాయాధికారుల వద్దకు చేరలేదు.  

 


Updated Date - 2021-06-13T03:39:17+05:30 IST