బహుమతిగా 100 వైన్ బాటిల్స్.. టేలర్ రియాక్షన్ ఇదే

ABN , First Publish Date - 2020-02-21T23:05:53+05:30 IST

న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో

బహుమతిగా 100 వైన్ బాటిల్స్.. టేలర్ రియాక్షన్ ఇదే

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌తో కలిపి రాస్ టేలర్ తన కెరీర్‌లో 100 టెస్టులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాక.. మూడు ఫార్మాట్లలో 100కి పైగా మ్యాచులు ఆడిన ఏకైక ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. 100 టెస్టులు ఆడిన నాలుగో న్యూజిలాండ్ క్రికెటర్‌గా కూడా అతను నిలిచాడు. 


అన్ని ఫార్మాట్లలో కలిపి 100 మ్యాచులు పూర్తి చేసుకున్న సందర్భంగా కివీస్ జట్టు రాస్ టేలర్‌కి ఓ విచిత్రమైన బహుమానం ఇచ్చింది. మాజీ ఆటగాడు ఇయాన్ స్మిత్ చేతుల మీదుగా అతనికి 100 వైన్ బాటిల్స్ అందించింది. ఇయాన్ చేతుల మీదుగా ఈ బహుమానం అందుకోవడం చాలా సంతోషంగా ఉందని టేలర్ అన్నాడు. ‘‘రాత్రి ప్రెజెంటేషన్ చాలా గొప్పగా జరిగింది. మంచి మిత్రుడు, మెంటార్ ఇయాన్ స్మిత్ కొన్ని మంచి మాటలు చెప్పాడు. ఇది కాస్త అతిగా అనిపించిన జట్టు సభ్యులతో కానీ, కుటుంబసభ్యులతో కానీ.. ఇలాంటి అనుభవం మరోసారి జరుగదు. ఇవి అన్ని తాగడానికి నాకు సహాయం కావాలి’’ అని టేలర్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-02-21T23:05:53+05:30 IST