బేక్డ్‌ వెజ్‌ బ్రొకోలి

ABN , First Publish Date - 2020-08-08T19:19:34+05:30 IST

బ్రొకోలి - పావుకేజీ, క్యారెట్లు - రెండు, బీన్స్‌ - నాలుగైదు, మైదా - 100గ్రా, వెన్న - 100గ్రా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌, ఛీజ్‌ - అరకప్పు, పాలు - ఒకకప్పు.

బేక్డ్‌ వెజ్‌ బ్రొకోలి

కావలసినవి: బ్రొకోలి  - పావుకేజీ, క్యారెట్లు - రెండు, బీన్స్‌ - నాలుగైదు, మైదా - 100గ్రా, వెన్న - 100గ్రా, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - ఒక  టీస్పూన్‌, ఛీజ్‌ - అరకప్పు, పాలు - ఒకకప్పు.


తయారీ: ముందుగా బ్రొకోలిని ముక్కలుగా కట్‌ చేయాలి. క్యారెట్లు, బీన్స్‌ను కట్‌ చేసుకోవాలి. అన్నింటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కాస్త వేడి అయ్యాక వెన్న వేయాలి. వెన్న కరిగాక మైదా వేసి బాగా కలపాలి. తరువాత పాలు పోయాలి. మిశ్రమం ఉండలు లేకుండా క్రీమ్‌లా అయ్యేలా చూసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు కలపవచ్చు. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో బ్రొకోలి, క్యారెట్‌, బీన్స్‌ ముక్కలు తీసుకోవాలి. అన్ని బాగా కలిసేలా కలియబెట్టాలి. వాటిపై క్రీమ్‌ను లేయర్‌లా పోయాలి. ఛీజ్‌ను సన్నగా తురిమి పైన వేయాలి. తరువాత ఓవెన్‌లో 180 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద నాలుగు నిమిషాల పాటు బేక్‌ చేయాలి. అంతే... టేస్టీ టేస్టీ వెజ్‌ బ్రొకోలి రెడీ.








Updated Date - 2020-08-08T19:19:34+05:30 IST