పెట్రో ధరలపై బీజేపీ, వైసీపీ దొంగాట

ABN , First Publish Date - 2021-10-29T05:38:18+05:30 IST

పెట్రో ధరలపై బీజేపీ, వైసీపీ దొంగాట ఆడుతున్నాయని, వెంటనే పెరిగిన పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలను జీఎస్టీ పరిఽధిలోకి తేవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.నారాయణ డిమాండ్‌ చేశారు.

పెట్రో ధరలపై బీజేపీ, వైసీపీ దొంగాట
ఆటోకు తాడుకట్టి లాగుతున్న సీపీఐ, సీపీఎం నాయకులు

జీఎస్టీ పరిధిలోకి తేవాలి

వినూత్న నిరసనలో వామపక్ష నేతల డిమాండ్‌ 

కడప (రవీంద్రనగర్‌), అక్టోబరు 28 : పెట్రో ధరలపై బీజేపీ, వైసీపీ దొంగాట ఆడుతున్నాయని, వెంటనే పెరిగిన పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలను జీఎస్టీ పరిఽధిలోకి తేవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బి.నారాయణ డిమాండ్‌ చేశారు. వామపక్ష పార్టీలతో కలిసి కడప పాతబస్టాండ్‌ నుంచి ఏడురోడ్ల సర్కిల్‌ వరకు ఆటోకు ఎడ్లను కట్టి లాగుతూ నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి కరోనా నేపధ్యం సాకుగా చూపించి తప్పించుకుంటున్నాయన్నారు. ఏడాదిలోపే పెట్రోల్‌ రూ.60 నుంచి రూ.115కు పెంచేశారని, రూ.600 గ్యాస్‌ బండ ధర రూ.1000కి పెంచి సామాన్యుడి నడ్డి విరిచేశారన్నారు. నిత్యావసర ధరలు అందుబాటులో లేవని మండిపడ్డారు. పెరిగిన ధరలపై బీజేపీ, వైసీపీ దొంగాట ఆడుతున్నాయని, పెట్రోల్‌, డీజల్‌, గ్యాస్‌ ధరలపై చిత్తశుద్ధి ఉంటే వైసీపీ, జనసేన ప్రత్యక్ష పోరుకు పిలుపునివ్వాలని వారు డిమాండ్‌ చేశారు. పాలక, ప్రతిపక్షాలు పరస్పర దూషణలతో ప్రజలను పక్కదారి పట్టిస్తున్నాయని, సంక్షేమాన్ని, ప్రగతిని విస్మరించాయని ఆగ్రహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని, పెట్రోల్‌, డీజల్‌పై పాలకుల పన్నులను తగ్గించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరాటాలు చేయకపోతే చరిత్ర హీనులవుతారని స్పష్టం చేశారు. పాలకులను ప్రజలు నిలదీయకపోతే సమాదులకు తామే రాళ్లు పేర్చుకుంటారని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ లిబరేషన నాయకులు రమణయ్య, సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు ఎన.వెంకటశివ, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.కృష్ణమూర్తి, ఎల్‌.నాగసుబ్బారెడ్డి, జి.చంద్ర, సుబ్రమణ్యం, ఎ.వి.రమణ, దస్తగిరిరెడ్డి, ఐ.ఎన.సుబ్బమ్మ, పద్మ, అన్వేష్‌, పాపిరెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:38:18+05:30 IST