హుజూరాబాద్‌లో బీజేపీదే గెలుపు

ABN , First Publish Date - 2021-06-18T05:56:16+05:30 IST

హుజూరాబాద్‌ గడ్డపై కాషాయం జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి వెళ్లేక్రమంలో ఆయన గురువారం రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయనతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. సిద్దిపేట బీజేపీ నాయకులు, ముదిరాజ్‌ మహాసభ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు.

హుజూరాబాద్‌లో బీజేపీదే గెలుపు
సిద్దిపేట రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న ఈటల రాజేందర్‌, వివేక్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఏనుగు రవీందర్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ ఏర్పడిన లక్ష్యం నెరవేరలేదు

2023లో రాష్ట్రంలో ఎగిరేది కాషాయ జెండానే

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌


సిద్దిపేట అర్బన్‌/గజ్వేల్‌/హుస్నాబాద్‌, జూన్‌ 17: హుజూరాబాద్‌ గడ్డపై కాషాయం జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. బీజేపీలో చేరిన అనంతరం తొలిసారి సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌ నియోజకవర్గానికి వెళ్లేక్రమంలో ఆయన గురువారం రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఆయనతోపాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి ఉన్నారు. సిద్దిపేట బీజేపీ నాయకులు, ముదిరాజ్‌ మహాసభ నాయకులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఈటల మీడియాతో మాట్లాడుతూ ఏ లక్ష్యం కోసం టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించిందో.. ఆ లక్ష్యాన్ని నెరవేరలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. హుజురాబాద్‌ ఉపఎన్నికతోపాటు 2023 సాధారణ ఎన్నికల్లోనూ కాషాయ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాజీనామా అనంతరం తరకు ప్రజల నుంచి ఊహించినదానికంటే ఎక్కువ ఆధరణ తెలిపారు. ప్రజలు అడుగడుగునా స్వాగతం పలుకుతుంటే ఉత్సాహం రెట్టింపవుతున్నదన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు వెంకటేశం, శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, ఉడుత మల్లేశం తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట నుంచి హుజూరాబాద్‌కు బయలుదేరిన ఈటల రాజేందర్‌కు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు  రథసారథిగా మారారు. ఈటల ప్రయాణిస్తున్న కారును రఘునందన్‌ రావు స్వయంగా నడిపారు. బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంతో నినాదాలు చేశారు.


ఈటలకు ఘనస్వాగతం

హుజురాబాద్‌కు వెళ్తున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌కు గురువారం గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని హరిత రెస్టారెంట్‌ వద్ద బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. అలాగే, హుస్నాబాద్‌ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా వద్ద బీజేపీ, ముదిరాజ్‌ సంఘం నాయకులు ఈటలకు స్వాగతం పలికారు. మల్లెచెట్టు చౌరస్తా నుంచి అక్కన్నపేట చౌరస్తా వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో కలిసి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజ్వేల్‌లో ఆయనవెంట బీజేపీ నాయకులు స్వామిగౌడ్‌, నలగామ శ్రీనివాస్‌, యెల్లు రాంరెడ్డి, పేర్ల శ్రీనివాస్‌, డాక్టర్‌ కుమారస్వామి, మనోహర్‌యాదవ్‌, తిరుపతి, కోదండం శ్రీనివా్‌సరెడ్డి, భానుప్రకాశ్‌ ఉన్నారు. హుస్నాబాద్‌లో స్వాగతం పలికినవారిలో దొడ్డి శ్రీనివాస్‌, బత్తుల శంకర్‌బాబు, లక్కిరెడ్డి తిరుమల, కవ్వ వేణుగోపాల్‌రెడ్డి, నాగిరెడ్డి విజయపాల్‌రెడ్డి, శ్రీధర్‌గౌడ్‌, వేణు, సమ్మయ్య, స్వరూప, జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-18T05:56:16+05:30 IST