వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం

ABN , First Publish Date - 2022-07-01T04:54:41+05:30 IST

రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో బీజేపీ అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి వివిధ మోర్చాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేం ద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీదే అధికారం
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి

ప్రధాని సభను విజయవంతం చేయాలి

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి

ఏసీసీ, జూన్‌ 30: రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని  కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలో బీజేపీ అసెంబ్లీ నియోజక వర్గ స్థాయి వివిధ మోర్చాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేం ద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజనను రాష్ట్రం లోని కేసీఆర్‌ ప్రభుత్వం అమలు పర్చకుండా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రకటించారన్నారు. ఇంత వరకు ఒక్కరికి  డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను అందజేయలేదని విమర్శించారు.  ఆయుష్మాన్‌ భారత్‌ ప్రపంచంలోనే గొప్ప పథకమన్నారు. వై ద్యం కోసం పేదలు వారి భూములు అప్పులు చేయడం గతం లో జరిగేదని, మోదీ ప్రధానిగా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని  అమలు పరుస్తూ పేదల వైద్యం కోసం రూ.5 లక్షల వరకు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కావాలనే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు పర్చకుండా పేద ప్రజ లకు నష్టం కలిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో త్వరలోనే కేసీఆర్‌  కుటుంబ పాలన అంతమవుతుందన్నారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలు చూపిస్తున్న ఉత్సాహం, మోదీ మీద నమ్మకం, బీజేపీకి ప్రజలు మద్దతు ఇస్తున్నారనడానికి నిదర్శనమన్నారు.  హైద్రాబాద్‌లో ప్రధాని సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయా లని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ఇన్‌చార్జి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌, నాయకులు  పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనారాయణ మందిర్‌లో పురప్ర ముఖులు, మేధావులు, వ్యాపార వేత్తలతో నిర్వహించిన సమా వేశంలో కేంద్ర మంత్రి అన్నపూర్ణదేవి పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 

బెల్లంపల్లి: వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని జమ్ముకా శ్మీర్‌ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ కవీందర్‌ గుప్తా పేర్కొన్నారు. గురువారం బీజేపీ కార్యాలయంలో పార్టీ జెండా ను ఆవిష్కరించి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు దోచుకోవడం, దాచు కోవడం తప్ప ప్రజలకు చేసిందేమి లేదన్నారు.  ప్రధాని మోదీ దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నాను.  3న హైద్రాబాద్‌లో జరిగే ప్రధాని బహిరంగ సభను విజయ వంతం చేయాలని పేర్కొన్నారు. పట్టణాధ్యక్షుడు కోడి రమేష్‌,  నియోజకవర్గ ఇన్‌చార్జి కొయ్యల ఏమాజీ, జిల్లా ప్రధాన కార్య దర్శి రమేష్‌, జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్‌ అనితరాజులాల్‌యాదవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T04:54:41+05:30 IST