2024 Lok Sabha Elections : బీజేపీ 50 సీట్లకు పరిమితమవుతుంది : నితీశ్ కుమార్

ABN , First Publish Date - 2022-09-04T15:07:50+05:30 IST

బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)

2024 Lok Sabha Elections : బీజేపీ 50 సీట్లకు పరిమితమవుతుంది : నితీశ్ కుమార్

పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar)  రానున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టారు. సమైక్య ప్రతిపక్షం దెబ్బకు బీజేపీ (BJP) తట్టుకోలేదని ఢంకా బజాయించి చెప్పారు. శనివారం జరిగిన జేడీయూ (JDU) జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2024 సాధారణ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాడితే బీజేపీ 50 స్థానాలకు పరిమితమవుతుందన్నారు. ఆ కార్యక్రమానికి తాను అంకితమవుతున్నానని చెప్పారు. 


నితీశ్ సోమ, మంగళవారాల్లో ఢిల్లీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రాజకీయ నేతలతో చర్చలు జరుపుతారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తారు. బీజేపీని గద్దె దించడమే తన లక్ష్యమని ఆయన చెప్తున్నారు. ప్రధాన మంత్రి పదవికి పోటీలో తాను ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు. 


మణిపూర్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలు ఉండేవారు, వీరిలో ఐదుగురు ఇటీవల బీజేపీలో చేరిపోయారు. నితీశ్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఇది సరైనదేనా? ఇది రాజ్యాంగబద్ధమైనదేనా? ఇది నిబంధనలకు అనుగుణంగా ఉందా? బీజేపీ ఇటువంటి కార్యక్రమాలను ఎక్కడపడితే అక్కడ చేస్తోంది. సకారాత్మక ప్రజా తీర్పు కోసం 2024లో ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలి’’ అని చెప్పారు. దీనిపై జేడీయూ నేత రాజీవ్ రంజన్ వురపు లలన్ సింగ్ మాట్లాడుతూ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ ధనబలాన్ని ప్రయోగిస్తోందని దుయ్యబట్టారు. 


Updated Date - 2022-09-04T15:07:50+05:30 IST