BJP బలహీనత Modi: Prashant Kishor

ABN , First Publish Date - 2022-05-11T22:24:17+05:30 IST

బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం అవుతుందనే వాదనలను పీకే కొట్టి పారేశారు. బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం కాదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. అయితే దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని సూచించారు..

BJP బలహీనత Modi: Prashant Kishor

పాట్నా: Bharatiya Janata Party బలం దాని సంస్థాగత వ్యవస్థ అయితే బలహీనత Prime Minister Narendra Modi అని Political strategist Prashant Kishor అన్నారు. అన్నింటికి మోదీపై ఆధారపడటం ఆ పార్టీకి నష్టం చేకూరుస్తుందని ఆయన అన్నారు. మంగళవారం నిర్వహించిన ఒక ఆన్‌లైన్ చర్చా వేదకలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీని నిలువరించడం, ఓడించడం అంత చిన్న విషయమేమీ కాదన్న పీకే.. ప్రతిపక్షాలు సరైన పంథాలో నడిస్తే బీజేపీకి ప్రత్యామ్నాయం సృష్టించవచ్చని అన్నారు.


బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం అవుతుందనే వాదనలను పీకే కొట్టి పారేశారు. బీజేపీకి ఆప్ ప్రత్యామ్నాయం కాదని, కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయమని అన్నారు. అయితే దశాబ్దాల పాటు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రతిపక్ష హోదాలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలని సూచించారు. 30 శాతం ఓట్లు సాధించే స్థితిలో ఉన్న పార్టీ దానంతల అదే పడిపోతుందనుకోవడం పొరపాటని, సరైన ప్రత్యామ్నాయం లేకపోతే రాబోయే కొన్నేళ్లు అదే పార్టీ అధికారంలో ఉండొచ్చని పీకే అన్నారు. ఇక బీజేపీకి మోదీ బలహీనత అని చెప్పిన పీకేకు ప్రస్తుతం బతికున్న నాయకుల్లో ఎల్‌కే అద్వాణీ అంటే ఇష్టమని చెప్పడం గమనార్హం.

Read more