బద్వేల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం

ABN , First Publish Date - 2021-10-29T05:06:39+05:30 IST

బద్వేలు ఉపఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగితే భారతీయ జనతా పార్టీ గెలుపొందడం తథ్యమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు పేర్కొన్నారు.

బద్వేల్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యం
విలేకర్ల సమావేశంలో ప్రసంగిస్తున్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు

 బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు 

రాజంపేట, అక్టోబరు28 : బద్వేలు ఉపఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగితే భారతీయ జనతా పార్టీ గెలుపొందడం తథ్యమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమే్‌షనాయుడు పేర్కొన్నారు. గురువారం రాజంపేట బీజేపీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్భయంగా ఓట్లు వేసే పరిస్థితి వస్తే బీజేపీకి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల కమిషనర్‌ ఈ విషయంలో శ్రద్ధ చూపి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి ఎన్నికల్లో అధికార వైసీపీ నాయకులు వలంటీర్ల ద్వారా స్థానిక ప్రజలను భయబ్రాంతులకు గురి చేసి ఓట్లు వేయించుకున్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు మర్చి పోలేదన్నారు. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రకటించి నలుగురు మంత్రులు 15 మంది ఎమ్మెల్యేలు బద్వేలులో తిష్ఠవేసి ఇంటింటా ప్రచారం నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజంపేట అసెంబ్లీ ఇన్‌చార్జి పోతుగుంట రమే్‌షనాయుడు, పట్టుపోగుల ఆదినారాయణ, సూర్యచంద్ర, అభిరామ్‌, రమణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T05:06:39+05:30 IST