అది బీజేపీ రెండు రోజుల సర్కస్ : KTR

ABN , First Publish Date - 2022-07-01T00:18:23+05:30 IST

Hyderabad: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో

అది బీజేపీ రెండు రోజుల సర్కస్ :  KTR

Hyderabad: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, ప్రధాని మోదీ బహిరంగ సభ నేపథ్యంలో ఇలా మాట్లాడారు.


‘‘బీజేపీ రెండు రోజుల సర్కస్ వస్తుంది. బీజేపీ వాళ్లు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో బీజేపీ సిపాయి వస్తాడట. రానివ్వండి. ఆ సిపాయిలకు మన 24 గంటల కరెంట్ చూపాలి. రైతు బంధు, రైతు బీమా గురించి చెప్పాలి. రైతు వేదికలు చూపించాలి. ఇంటింటికి నల్లా చూపించాలి. మన పథకాలన్నింటిని గ్రామాలకు వచ్చే బీజేపీ నేతలకు వివరించండి.  తెలంగాణకు మోడీ ఏం చేశాడో ప్రశ్నించండి. నల్లధనం అడిగితే తెల్ల మొహం వేస్తున్నాడు. మన సొమ్ముతో కులుకుతూ మొండిచేయి చూపుతున్న చిల్లర పార్టీ బీజేపీ. ఇక్కడికి వచ్చే బీజేపీ నేతలు ప్రజలకు సెల్యూట్ కొట్టి వెళ్ళాలి. మోడీ బాత్ కరోడ్ మే, కాం పకోడీ మే అన్నట్లుగా ఉంది. తెలంగాణకు ఏమి ఇవ్వని మోడీకి బైబై చెప్పాలి.’’ అని విమర్శించారు.


కాంగ్రెస్ పార్టీకి సిగ్గుండాలి

‘‘రేవంత్ అనే చిలుక మనదే కానీ పలుకు పరాయిది. యాభై ఎండ్లు రాష్ట్రాన్నినడిపిందే కాంగ్రెస్..ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనడానికి సిగ్గుండాలి.’’ అని కేటీఆర్ విమర్శించారు.


ఆ బాధ్యత నాది..

కల్వకుర్తిలో 38వేల ఎకరాలకు నీళ్ళు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని, త్వరలోనే అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేయిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. 58వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని, టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-01T00:18:23+05:30 IST