మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది: గెహ్లోత్

ABN , First Publish Date - 2020-12-05T21:13:17+05:30 IST

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు ఇప్పటికే ఐదు ప్రభుత్వాల్ని కూలదోశారు. మాది ప్రస్తుతం ఆరోది. పాలన వదిలేసి బీజేపీ ఇలాంటి కుట్రలే చేస్తూ వస్తోంది’’ అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది: గెహ్లోత్

జైపూర్: తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లతో చర్చ అనంతరం తమ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడారని, బీజేపీ కుయుక్తులను తనతో చెప్పి అమిత్ షాపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంమంత్రిగా సేవలందించారని, అలాంటి పదవిలో ఉన్న అమిత్ షా.. ఆ పదవికి కళంకం తెస్తున్నారని గెహ్లోత్ మండిపడ్డారు.


‘‘వాళ్లు (బీజేపీ) మా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లతో మీటింగ్ ముగిసిన అనంతరం మా ఎమ్మెల్యేలు నన్ను కలిశారు. అమిత్ షా లాంటి వ్యక్తి హోంమంత్రిగా ఉండడం సిగ్గనిపించిందని వాళ్లు నాతో అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ పటేల్ ఈ దేశానికి మొట్టమొదటి హోంమంత్రి. ప్రస్తుతం ఆ పదవిలో అమిత్ షా ఉన్నారు’’ అని అశోక్ గెహ్లోత్ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘వాళ్లు ఇప్పటికే ఐదు ప్రభుత్వాల్ని కూలదోశారు. మాది ప్రస్తుతం ఆరోది. పాలన వదిలేసి బీజేపీ ఇలాంటి కుట్రలే చేస్తూ వస్తోంది’’ అని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.

Updated Date - 2020-12-05T21:13:17+05:30 IST