బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఘర్షణ

ABN , First Publish Date - 2021-01-25T06:05:50+05:30 IST

నిత్యం వచ్చిపోయే వాహ నాలతో రద్దీగాఉండే తెలంగాణచౌక్‌ ఆదివారం బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల గొడవకు వేదికగా మారింది.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల ఘర్షణ
గొడవపడుతున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

- దిష్టిబొమ్మ దహనంపై ఇరువర్గాల బాహాబాహి

- పిడిగుద్దులతో దద్దరిల్లిన తెలంగాణచౌక్‌

- అడ్డుకుని అరెస్టు చేసిన పోలీసులు

గణేశ్‌నగర్‌, జనవరి 24: నిత్యం వచ్చిపోయే వాహ నాలతో రద్దీగాఉండే తెలంగాణచౌక్‌ ఆదివారం బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల గొడవకు వేదికగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌ దిష్టిబొమ్మ దహనంపై ఇరువర్గాలు బాహాబాహికి దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడంతో తెలంగాణ చౌక్‌దద్దరిల్లింది. పావుగంటకుపైగా జరిగిన గలాటలో పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. పరిస్థి తులు ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందు కున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిర సిస్తూ టీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు పొన్నం అనిల్‌కు మార్‌ నేతృత్వంలో కార్యకర్తలు తెలం గాణచౌక్‌లో సంజయ్‌ దిష్టిబొమ్మనుదహనం చేసేందుకు ప్రయత్ని స్తుండగా అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానా లను నిరసిస్తూ ధర్నా చేపట్టేం దుకు బీజేపీ, బీజేవైఎం కార్యక ర్తలు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దిష్టిబొమ్మ దహనానికి సిద్ధంగా ఉన్న టీఆర్‌ఎస్‌వీ నాయకులను అడ్డుకునే యత్నం చేశారు. ఈక్రమంలో వారిమధ్య వాగ్వాదం జరిగింది. అదితీవ్రమై ఒకరినొ కరు తోసుకుంటుండగా, ఓ బీజేపీ నాయకుడు కిందపడ్డాడు. దీనితో ఆపార్టీ కార్యకర్తలు టీఆర్‌ఎస్వీ నాయకులపై విరుచుకుప డ్డారు. వాళ్లు ఎదురు తిరగడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. పరిస్థితులు సద్దుమణగక పోవడంతో అందరినీ అదుపులోకి తీసు కొని పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. గలాటను నిలువరించే ప్రయ త్నంలో టూటౌన్‌సీఐ లక్ష్మీబాబు కిందపడడంతో స్వల్పగాయాలయ్యాయి. బీజేపీ, టీఆర్‌ఎస్వీ కార్య కర్తలు పలువురికి బలమైన గాయాలు కాగా, ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌వీ నాయకుడు పొన్నం అనిల్‌, ఫహద్‌ మాట్లాడుతూ రాష్ర్టానికి బీజేపీ అధ్య క్షుడిగా వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజల ఓట్లతో ఎంపీగా గెలిచి ఈ రాష్ర్టాన్ని దగుల్బాజీ రాష్ట్రం అనడం బండి సంజయ్‌ అవివేకానికి నిదర్శనమన్నారు. దుష్ర్పాచా రాలు చేసినా, అవాకులు చెవాకులు పేలినా ఊరుకు నేది లేదని హెచ్చరించారు. బీజేపీ నాయకుడు ప్రవీ ణ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో, కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలో సమస్యలకోసం పోరాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీబండిసంజయ్‌ కుమార్‌పై అక్కసుతో టీఆర్‌ఎస్‌ నాయకులు నిరసన కార్యక్రమాలకు దిగడం సిగ్గుచేటని విమర్శించారు. జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేని టీఆర్‌ఎస్‌పార్టీకి ఎంపీని విమర్శించే అర్హతలేదన్నారు. టీఆర్‌ఎస్‌వీ నాయకులు కిమ్‌ఫహద్‌,పెండ్యా లమహేశ్‌, సాయికృష్ణ,కిరణ్‌,మాడిశెట్టిఅజయ్‌, వినోద్‌, పటేల్‌శ్రావణ్‌రెడ్డి, బొంకూరిమోహన్‌, నేరెళ్ల శ్రీనివాస్‌, ఆనంద్‌, బీజేపీనాయకులు నాగసముద్రం ప్రవీణ్‌, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, ఉప్పరపల్లి శ్రీను, సంపత్‌, మహేశ్‌, అనిల్‌, ప్రసన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-25T06:05:50+05:30 IST