తీవ్ర వివాదం: BJP నుంచి Nupur Sharma ఔట్

ABN , First Publish Date - 2022-06-05T21:53:47+05:30 IST

భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను ఆదివారం పార్టీ నుంచి తొలగించారు. ఆమెతో పాటు మీడియా చీఫ్ నవీన్ జిందాల్‌‌ను సైతం తొలగించారు. పార్టీలో వీరికి పార్టీలో ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..

తీవ్ర వివాదం: BJP నుంచి Nupur Sharma ఔట్

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మను ఆదివారం పార్టీ నుంచి తొలగించారు. ఆమెతో పాటు మీడియా చీఫ్ నవీన్ జిందాల్‌‌ను సైతం తొలగించారు. వీరికి పార్టీలో ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక టీవీ డిబేట్లో మాట్లాడుతూ మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల వల్లే కాన్పూర్‌లో అల్లర్లు జరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రకటన అనంతరమే ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడం విశేషం.

Updated Date - 2022-06-05T21:53:47+05:30 IST