BJP survey: తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై బీజేపీ అంతర్గత సర్వే

ABN , First Publish Date - 2022-07-30T00:49:44+05:30 IST

తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై బీజేపీ (BJP) అంతర్గత సర్వే నిర్వహించింది. ఈ సర్వే రిపోర్టును రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

BJP survey: తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై బీజేపీ అంతర్గత సర్వే

హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ పరిస్థితులపై బీజేపీ (BJP) అంతర్గత సర్వే నిర్వహించింది. ఈ సర్వే రిపోర్టును రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ (Bandi Sanjay)కి బీజేపీ అధిష్టానం పంపింది. రిపోర్టులో పార్టీల వారీగా బలమైన నేతల జాబితాను తయారు చేసినట్లు తెలుస్తోంది. బలమైన నేతలను బీజేపీలోకి తీసుకురావాలని బండి సంజయ్‌కి అధిష్టానం ఆదేశించింది. గోవా మోడల్‌ (Goa model)లో గెలుపు గుర్రాలను మాత్రమే పార్టీలోకి తీసుకోవాలని సంజయ్ సూచించింది. నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులను కూడా ఆకర్షించే పని మొదలుపెట్టాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. తెలంగాణలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ తన కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తోంది. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉన్నా.. రాష్ట్రంలో పట్టు కోసం బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటినుంచే సర్వశక్తులు ఒడ్డుతోంది. 


తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలను నాలుగు క్లస్టర్స్‌గా విభజించారు. ఒక్కో క్లస్టర్‌లో మూడు, నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటాయి. ప్రతి నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌గా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్ ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి ఇన్‌చార్జ్‌గా ప్రహ్లాద్ జోషి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ ఇన్‌చార్జ్‌గా మహేంద్రనాథ్ పాండే, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌గా కేంద్రమంత్రి బీఎల్ వర్మను నియమించారు. వీరితో పాటు ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక కేంద్రమంత్రిని నియమించారు. ఆదిలాబాద్, పెద్దపల్లికి పురుషోత్తం రూపాల, జహీరాబాద్‌కు నిర్మలా సీతారామన్, మెదక్‌కు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, చేవెళ్ల, మల్కాజ్ గిరికి ప్రహ్లాద్ జోషి, భువనగిరికి దేవీసింగ్ చౌహాన్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్‌కు మహేంద్రనాథ్ పాండే, నల్లగొండకు కైలాశ్ చౌదరి, వరంగల్‌కు ఇంద్రజిత్ సింగ్,  హైదరాబాద్‌కు జ్యోతిరాధిత్య సింధియా, మహబూబాబాద్, ఖమ్మం‌కు బీఎల్ వర్మను నియమించారు.తెలంగాణ నుంచి పార్లమెంట్ ప్రవాసీ కన్వీనర్‌గా ప్రేమేందర్ రెడ్డి, కోకన్వీనర్లుగా ఉమారాణి, జయశ్రీని నియమించారు. 

Updated Date - 2022-07-30T00:49:44+05:30 IST