మొహం చెల్లకే ఈసీపై నిందలు

ABN , First Publish Date - 2021-10-26T08:44:14+05:30 IST

తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే గడీల పాలన పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం బేతిగల్‌, చల్లూరులో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు.

మొహం చెల్లకే ఈసీపై నిందలు

  •  కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలి: బండి సంజయ్‌
  • రాష్ట్రంలో నిజాం పాలన: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  • ఉద్యోగాలివ్వని సీఎంను గద్దె దించాలి: ఈటల


హుజూరాబాద్‌/వీణవంక/జమ్మికుంట, అక్టోబరు 25: తెలంగాణలో పేదల రాజ్యం రావాలంటే గడీల పాలన పోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం బేతిగల్‌, చల్లూరులో సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనన్నారు. బంగారు తెలంగాణ రాలేదు కానీ.. ఏడేళ్లలో కేసీఆర్‌ కుటుంబం బంగారమైందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.  చెల్పూర్‌, రాంపూర్‌, సిర్సపల్లి గ్రామాల్లో బీజేపీ అభ్యర్థి ఈటలకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరుల త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతుందన్నారు. ఈ టల వెంట హుజూరాబాద్‌ ప్రజలతో పాటు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నయా నిజాం పాలన కొనసాగుతుందని అన్నారు.


హుజూరాబాద్‌లో బీజేపీ జాతర నడుస్తోందని, ఏ గ్రామానికి పోయినా ఈటల పేరే వినిపిస్తోందన్నారు.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై నీతులు చెబుతున్న హరీశ్‌కు... వాటిని జీఎస్టీలో చేర్చమని అడిగే దమ్ముందా? అని బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ప్ర శ్నించారు. కేసీఆర్‌ పంపుతున్న మందు సీసాలు, డబ్బు సంచులను పాతర వేయాలని సూచించారు.  టీఆర్‌ఎస్‌ ఎ మ్మెల్యేలు, మంత్రులు భయపెట్టినా యువకులు ధైర్యంగా ముందుకు వస్తున్నారన్నారు. 

Updated Date - 2021-10-26T08:44:14+05:30 IST