Annamalai comments: కాంగ్రెస్-డీఎంకే హయాంలోనే జీఎస్టీ

ABN , First Publish Date - 2022-08-05T14:56:14+05:30 IST

కాంగ్రెస్-డీఎంకే(Congress-DMK) నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం జీఎ్‌సటీ విధానం తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

Annamalai comments: కాంగ్రెస్-డీఎంకే హయాంలోనే జీఎస్టీ

                         - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై

 

పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 4: కాంగ్రెస్-డీఎంకే(Congress-DMK) నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం జీఎ్‌సటీ విధానం తీసుకొచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆరోపించారు. నగరంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, బ్రాండెడ్‌ సరుకులపై 5 శాతం జీఎస్టీ విధించింది కేంద్రప్రభుత్వం కాదని, వివిధ రాష్ట్రాలకు చెందిన 56 మంది ప్రతినిధులతో కూడిన కౌన్సిల్‌ నిర్ణయించిందని తెలిపారు. జీఎస్టీ(GST)  అమలుపై ఆర్ధిక నిపుణుల అభిప్రాయాల మేరకు 2014లో బీజేపీ(BJP) నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేసిందని, ఈ విధానంలో రాష్ట్రాలకు కేటాయించే వాటాలో ఎలాంటి తగ్గుదల లేదని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన డీఎంకే అధికారం చేపట్టాక ఎందుకు అమలుచేయలేదని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌(Uttar Pradesh, Gujarat) రాష్ట్రాల కన్నా తమిళనాడులోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అధికమని అన్నామలై ఆరోపించారు.

Updated Date - 2022-08-05T14:56:14+05:30 IST