Abn logo
Sep 28 2021 @ 22:48PM

బండి సంజయ్ పాదయాత్రకు ఎన్నికల కోడ్ కష్టాలు!

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ఎన్నికల కోడ్ కష్టాలు రానున్నాయి. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కన్ఫ్యూజన్‌లో ఉంది. హుజూరాబాద్ ఎన్నికల కోడ్ నిబంధనలతో ఇబ్బందులు తప్పేలా లేవు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్  కఠిన నిబంధనలు విధించింది. ఎన్నికలు నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించరాదంటూ నిబంధన విధించింది. అక్టోబర్ 2న హుజూరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలతో సభకు ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  500లకు మించి జనసమీకరణ ఉండకూడదని ఈసీ ఆంక్షలు విధించింది. సంజయ్ వెంటరోజూ పాదయాత్రకు వందలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. బయట నుంచి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. 

బుధవారం సిద్దిపేటలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.  గురువారం ఉదయం కరీంనగర్ నగర్‌లో ప్రవేశించనున్నారు. హుజూరాబాద్‌కు వేళ్ళె పరిస్థితి లేకపోవడంతో పాదయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండాలన్న దానిపై చర్చ జరుగుతోంది. హుజూరాబాద్‌కు వెళ్ళకుండా హుస్నాబాద్‌కు వెళ్తే ఎలా ఉంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. పాదయాత్ర మొదటి విడత ముగింపు సభ భారీ జనసమీకరణతో చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న సభ నిర్వహించి తీరాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాకు సమీపంలో ఉన్న ప్రాంతంలోనే సభకు ప్లాన్ చేస్తున్నారు.