Abn logo
Sep 24 2021 @ 21:30PM

ప్రతి గింజా కొనాల్సిందే: బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల: రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసారు. సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లడారు. స్థానిక సంస్థలను సీఎం కేసీఆర్ నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేసారు. సర్పంచ్‌లకు కేసీఆర్ ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు.


300 ఎకరాల ఫార్మ్ హౌస్‌లో కేసీఆర్ దొడ్డు వడ్లు పండిస్తున్నారని, మరి ఇతర రైతులు ఎందుకు సన్న వడ్లు పండించాలని ఆయన ప్రశ్నించారు. ఏడేళ్లలో ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదన్నారు. పంట నష్టపోయి యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. పండించిన ప్రతి గింజా కొనాల్సిందేనన్నారు. కిలోమీటర్‌కు ఒక బార్ పెట్టాడని కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ ఇంట్లోనే ఐదు ఉద్యోగాలు ఉన్నాయన్నారు. తాను మాట్లాడే భాషలో తనకు గురువు కేసీఆరే అని సంజయ్ పేర్కొన్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption