Abn logo
Sep 25 2021 @ 20:12PM

మిలియన్ మార్చ్ చేస్తాం: బండి సంజయ్

రాజన్న సిరిసిల్ల: దీపావళి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకపోతే మిలియన్ మార్చ్ చేస్తామని ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు సంజయ్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్లలో సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. కరీంనగర్‌లో హిందూవులను బొందుగాళ్ళు అంటే కేసీఆర్‌ను బొంద పెట్టామని ఆయన పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ల దందా చేసి కేసీఆర్ చాలా మందిని మోసం చేసిండని ఆయన ఆరోపించారు. వరి వేస్తే ఉరే అని రైతులను కేసీఆర్ బెదిరిస్తున్నాడన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల గొడతామన్నారు. మొన్న కురిసిన వర్షాలకు సిరిసిల్ల మునిగిపోతే కేటీఆర్, కేసీఆర్ పట్టించుకోలేదని సంజయ్ నిలదీశారు. 

ఇవి కూడా చదవండిImage Caption