కారు-కమలం.. మధ్యలో ఈటల రాజేందర్!

ABN , First Publish Date - 2021-05-05T01:41:44+05:30 IST

కారు-కమలం.. మధ్యలో ఈటల రాజేందర్!

కారు-కమలం.. మధ్యలో ఈటల రాజేందర్!

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ అంశం ఇంకా తెలంగాణలో చర్చ నడుస్తూనే ఉంది. ఆయనకు సంబంధించిన భూముల వ్యవహారంలో ప్రభుత్వం హడావుడి చేసింది. తొలుత ఈటల రాజేందర్ మంత్రిత్వ శాఖను తొలగించింది. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసింది. అయితే ఈటల రాజీనామా చేస్తారా?. లేదా టీఆర్ఎస్ పార్టీనే ఆయనను బహిష్కరిస్తుందా అనే చర్చలు తాజాగా నడిచాయి. మూడు రోజలు నుంచి మాట్లాడని టీఆర్ఎస్ మంత్రులు మంగళవారం ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈటలపై విరుచుకుపడ్డారు. 


మరోవైపు జమున హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మంగళవారం హైకోర్టు జమున హ్యాచరీస్‌ కేసును విచారణ చేపట్టింది. జమున హ్యాచరీస్‌కు సరైన పద్ధతిలో నోటీసులు సర్వ్ చేసి ప్రభుత్వం విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని కోరింది. శుక్రవారం ఇచ్చి సోమవారం రిప్లై ఇవ్వమనేలా ఉండకూడదని షరతు విధించింది. వెనుక గేటు నుంచి కాదు.. రాచమార్గంలో వెళ్లి విచారణ జరపాలని ఆదేశించింది.  మే 1, 2వ తేదీల్లో జరిగిన విచారణను పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పింది. ప్రభుత్వ నివేదిక చెల్లదని పేర్కొంది. అధికారులు ఉల్లంఘనకు పాల్పడినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు పంపించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.


ఈ నేపథ్యంలో ‘‘తెలంగాణ రాజకీయాల్లో ఈటల ఎపిసోడ్ ప్రభావం ఎలా ఉంది?. ఈటల రాజేందర్‌పై మంత్రుల దాడిని పార్టీలు ఎలా చూస్తున్నాయి. టీఆర్ఎస్‌లో రాజేందర్ ఇష్యూని బీజేపీ ఏ కోణంలో చూస్తోంది?. బీజేపీ-టీఆర్ఎస్‌ల మధ్య అజ్ఞాత అవగాహన కుదిరిందా?. తాజా పరిణామాలు బీజేపీ-టీఆర్ఎస్ స్నేహాన్ని ధృవీకరిస్తున్నాయా?. ఈటలపై ప్రభుత్వ విచారణను హైకోర్టు ఎందుకు తప్పుబట్టింది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-05-05T01:41:44+05:30 IST