టీఆర్‌ఎస్‌పై బీజేపీ ఆర్టీఐ అస్త్రం

ABN , First Publish Date - 2022-07-07T09:44:10+05:30 IST

అధికార పార్టీపై సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) అస్త్రం సంధించాలని బీజేపీ నిర్ణయుంచింది.

టీఆర్‌ఎస్‌పై బీజేపీ ఆర్టీఐ అస్త్రం

  • కేసీఆర్‌ హామీల అమలుపై పార్టీ నేతలు, 
  • అనుబంధ సంఘాలతో దరఖాస్తుకు నిర్ణయం
  • 80 దరఖాస్తులు దాఖలు చేసిన సంజయ్‌


హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీపై సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) అస్త్రం సంధించాలని బీజేపీ నిర్ణయుంచింది. గత ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలతోపాటు వివిధ సందర్భాల్లో కేసీఆర్‌ ఇచ్చిన హామీల అమలు పురోగతిపై ఆర్టీఐ కింద వివరాలు ఇవ్వాలని కోరుతూ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల ద్వారా దరఖాస్తులు పెట్టించాలని నిర్ణయం తీసుకుంది. హామీ ల అమలుపై ఆధారాలతో సహా కేసీఆర్‌ను నిలదీసేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల యువ మోర్చా నేతలు, పార్టీ రాష్ట్ర నాయకులు దరఖాస్తులు దాఖలు చేయనున్నారు. కాగా, ఇప్పటికే పలు అంశాలపై సమాచారం ఇవ్వాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ 80కిపైగా దరఖాస్తులు సమర్పించారు.  


సంజయ్‌ దాఖలు చేసిన దరఖాస్తుల్లో కొన్ని..

2014 జూన్‌ 2 నుంచి 2022 జూన్‌ 2వరకు వివిధ సందర్భాల్లో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీల వివరాలు ఇవ్వండి జూ వాటిలో ఎన్ని నెరవేర్చారు? ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పించగలరు. జూ జూన్‌ 2, 2014 నుండి జూన్‌ 2,  2022 వరకుసీఎం కేసీఆర్‌.. ఎన్నిసార్లు సచివాలయంలో విధులు నిర్వహించారు? జూ ప్రగతిభవన్‌ నిర్మాణానికి ఖర్చు ఎంత? ఎప్పుడు ప్రారంభించి.. ఎప్పటికి పూర్తి చేశారు? జూ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేశారు? ఎన్ని పోస్టులు భర్తీ చేశారు? ఇంకా ఖాళీలెన్ని? జూ ఎనిమిదేళ్లలో సీఎం కేసీఆర్‌ ఎన్నిరోజులు అధికార నివాసంలో బసచేశారు? ఎన్ని రోజులు ఫాంహౌ్‌సలో ఉన్నారు? జూ 2014 జూన్‌ 2 నుం చి 2022 జూన్‌ 25 వరకు సీఎం కేసీఆర్‌ ఎన్ని రాష్ర్టాల్లో పర్యటించారు? ఆ పర్యటనలకు ఎంత ఖర్చు అయింది?  కేసీఆర్‌ పర్యటనలకు ప్రైవేట్‌ విమానాలను వినియోగించారా? లేక రెగ్యులర్‌ విమానాల్లోనే ప్రయాణించారా? జూ 2014 జూన్‌ 2 కన్నా ముందు నాటికి 2022 జూన్‌ 25 నాటికి సాగునీటి పరిస్థితిపై రాష్ట్రంలో నియోజకవ్గాల వారీ వివరాలు ఇవ్వగలరు. జూ ఎస్సీ, ఎస్టీల్లో ఎంత మందికి భూపంపిణీ చేశారు? సమాచారాన్ని జిల్లాల వారిగా ఇప్పించగలరు.  

Updated Date - 2022-07-07T09:44:10+05:30 IST