MLA Basana Gowda: నాకు హోం మంత్రి పదవి ఇచ్చి ఉంటే...
ABN , First Publish Date - 2022-09-20T18:04:25+05:30 IST
నాకు హోం మంత్రి పదవి ఇచ్చి ఉంటే రాష్ట్రంలో ఉగ్ర వాదులు, సంఘ విద్రోహకశక్తులకు తుపాకీతోనే సమాధానమిచ్చి ఉండేవాడినని
- తుపాకీతోనే సమాధానం: యత్నాళ్
బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నాకు హోం మంత్రి పదవి ఇచ్చి ఉంటే రాష్ట్రంలో ఉగ్ర వాదులు, సంఘ విద్రోహకశక్తులకు తుపాకీతోనే సమాధానమిచ్చి ఉండేవాడినని బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్(BJP rebel MLA Basanagowda Patil Yatnal) పేర్కొన్నారు. సోమవారం ఆయన శాసనసభ లాంజ్‌లో మీడియాతో మాట్లాడుతూ పార్టీలోని కొందరు పెద్ద మనుషులు తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుకున్నారంటూ వాపోయారు. రాష్ట్రంలో హిందూ కార్యకర్తల హత్యలను అడ్డుకునేందుకు తన వద్ద యూపీ తరహా గొప్ప ఫార్ములా ఉందన్నారు. భవిష్యత్తులో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నట్టు చెప్పారు. అవినీతి వ్యవ హారంలో కోర్టు ఆదేశాల మేరకు మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తారో లేదో వేచి చూడాలన్నారు. తనకు నిర్మొహమాటంగా మాట్లాడడం అలవాటని, ఇదే తనను పదవులకు దూరం చేసిందన్నారు.