Abn logo
Aug 11 2020 @ 20:29PM

రామ్ మాధవ్ వ్యాఖ్యలు జగన్‌కు షాకిచ్చాయా?

హైదరాబాద్: ఏపీ మూడు రాజధానులపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో... దేశంలో ఎక్కడా లేనట్టుగా మూడు రాజధానుల నిర్ణయం ఉందని కూడా రామ్ మాధవ్ వ్యాఖ్యానించారు. ఏపీ కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉన్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని.. అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని ప్రశ్నించిన విషయం కూడా తెలిసిందే.


రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ‘‘రామ్ మాధవ్ వ్యాఖ్యలు జగన్‌కు షాకిచ్చాయా?. జాతీయ నేత ప్రకటనతో కొత్త రాష్ట్ర నేతలు కంగుతిన్నారా?. వైసీపీకి వంతపాడుతున్న నేతలకు ఇదొక మెస్సేజా?. ఏపీలో అరాచకాలపై రాంమాధవ్ ఆగ్రహానికి కారణం ఏమిటి?. మూడు రాజధానుల ఫార్ములా మూడు రెట్ల అవినీతి కోసమేనా?. వైసీపీతో బీజేపీ సంఘర్షణ పథాన్ని అనుసరిస్తోందా?.’’ అనే అంశాలపై ఏబీన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్‌లో టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  రామకృష్ణ, బీజేపీ సమన్వయకర్త రఘురామ్ పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ మూడు రాజధానులపై ప్రజల్లో ఉన్న గందరగోళానికి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే తోడ్పడుతుందో..ప్రస్తుతం కేంద్రప్రభుత్వం, బీజేపీ పాత్ర కూడా అలాగే ఉందన్నారు. 

Advertisement
Advertisement
Advertisement