Abn logo
Oct 19 2021 @ 21:08PM

దళితులకు మూడెకరాల భూమి మాదిరే ...: రఘునందన్‌రావు

హైదరాబాద్: దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత రఘునందన్‌రావు అన్నారు. దళితబంధుపై హుజురాబాద్‌లో కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. దళితులకు మూడెకరాల భూమి మాదిరే ... దళితబంధు పథకం కూడా అని విమర్శించారు. తమకు పది లక్షలు ఇచ్చే ఆలోచన కేసీఆర్‌కు లేదని ప్రజలే అనుకుంటున్నారని చెప్పారు. దళితబంధును ఆపాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మానాభరెడ్డి ఈసీకి ఆగస్టులోనే లేఖ రాశారని పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకుండా ఎందుకు ఫ్రీజ్ చేశారో కేటీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఓటమి ఖాయమని తేలటంతోనే కేటీఆర్ ప్రచారానికి రావటం లేదన్నారు. ఈటల కాదు.. హరీష్‌రావే కాంగ్రెస్‌లోకి వస్తున్నారని రేవంత్‌రెడ్డి చెప్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతవుతోందనే రేవంత్‌ ప్రచారానికి రావడం లేదన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption