Abn logo
Sep 25 2021 @ 15:04PM

‘ఒలింపిక్ అసోసియేషన్‌కి కేటీఆర్, కవితకు ఉన్న సంబంధం ఏంటి?’

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి స్పోర్ట్స్ పాలసీ లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు అన్నారు. కొత్త స్టేడియాలు కట్టడం లేదు.. ఉన్న స్టేడియలను పటించుకోవడం లేదన్నారు. స్టేడియాలను ప్రైవేటు వ్యాపార సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఐదు ఎకరాల స్థలాన్ని టిమ్స్ కు కేటాయించడం సరైంది కాదన్నారు. టిమ్స్‌కు పంచనామా చేసి ఇచ్చిన భూమిని తిరిగి ఇవ్వకపోతే ఉద్యమిస్తామని వెల్లడించారు. క్రీడాకారులు అందరూ ఈ ఆందోళనకు తరలి రావాలని పిలుపునిచ్చారు. పీవీ.సింధు ఏ అంతర్జాతీయ వేదికల నుంచి తెలంగాణ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నట్లు చెప్పలేదన్నారు. ఏల్బీ స్టేడియం పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. మౌలిక సదుపాయాలు లేకపోతే క్రీడాకారులు ఎట్లా వస్తారు? అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ ప్రోత్సాహంతోనే జయేష్ రంజన్ తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడయ్యాడని చెప్పారు. 


తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్‌కి కేటీఆర్, కవితకు ఉన్న సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. జయేష్ రంజన్ తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడై 20నెలలు అవుతున్న బాధ్యతలు చేపట్టడం లేదన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే సోమవారం అసెంబ్లీకి వచ్చే ముందు ఏల్బీ స్టేడియంకు రావాలనన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కరెంటు బిల్లు కట్టకపోతే క్రీడాకారులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. క్రీడా విలేజ్ ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఏడేళ్లు అయిన నిర్మించలేదన్నారు. కేసీఆర్ చెప్పిన 25వేలు, కేటీఆర్ చెప్పిన 3వందల ఎకరాల్లో క్రీడా విలేజ్ ఏర్పాటు చేయలేదన్నారు. హరీష్ రావుకి ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. క్రీడా పాలసీ, స్టేడియాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తామన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...