పాద‌యాత్రకు ముందు బీజేపీలో అసంతృప్తి సెగ‌

ABN , First Publish Date - 2022-04-13T01:03:19+05:30 IST

పాద‌యాత్రకు ముందు బీజేపీలో అసంతృప్తి సెగ‌

పాద‌యాత్రకు ముందు బీజేపీలో అసంతృప్తి సెగ‌

హైదరాబాద్‌: పాద‌యాత్రకు ముందు బీజేపీలో అసంతృప్తి సెగ‌ రేగింది. బీజేపీ సంస్థాగ‌త ప్రధాన కార్యద‌ర్శి శ్రీనివాస్‌తో ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్‌రావు భేటీ అయ్యారు. ప్రజా సంగ్రామయాత్ర సన్నాహక సమావేశాల్లో త‌మ‌ను వేదిక‌పైకి ఎందుకు ఆహ్వానించలేదని రఘునందన్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మొద‌టి విడ‌త‌ యాత్ర ముగింపు స‌భ తన జిల్లాలో జ‌రిగినా... మాట్లాడే అవ‌కాశం ఎందుకు ఇవ్వలేదని రఘనందన్‌రావు ప్రశ్నించినట్లు సమాచారం. ఎంపీలు మాత్రమే ఎన్నిక‌ల్లో గెలిచారా?, ఎమ్మెల్యేలు కూడా ప్రజ‌ల ఓట్లతోనే గెలిచారని అన్నారు. అలాగే ఎంపీలు అర‌వింద్, సోయంను వేదికపైకి పిలిచి మమల్ని ఎందుకు పిలవలేదు? అని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు పిలిచేవ‌ర‌కు యాత్రకు వెళ్లనని ర‌ఘునందన్‌రావు స్పష్టం చేశారు. పిల‌వ‌కున్నా వెళ్లి అవ‌మాన ప‌డ‌ద‌ల‌చుకోలేదన్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల‌కు ఎందుకు ప‌ద‌వులు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. రాజాసింగ్ ఫ్లోర్ లీడ‌ర్‌గా ఉండ‌గా ఒకరికి డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్, మ‌రొక‌రికి విప్ బాధ్యత‌లు ఇవ్వొచ్చు కదా? అని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడ‌ర్ల నియామ‌కంలో జాప్యం ఎందుకు? అని ప్రశ్నించారు. వారికి ప‌ద‌వులిస్తే పార్టీ సంస్థాగ‌తంగా బలోపేతం అవుతుందన్నారు. ప‌ద‌వులివ్వకుండా పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు? అని రఘునందన్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2022-04-13T01:03:19+05:30 IST