త్వరలో బీజేపీ ప్రవాస్‌ యోజన

ABN , First Publish Date - 2022-07-06T07:06:22+05:30 IST

రాష్ట్రంలో 8 లోక్‌సభ నియోజకవర్గ్గా పరిధిలో బీజేపీ గెలుపుకోసం పనిచేస్తుందని, అందుకు బీజేపీ లోక్‌సభ ప్రవాస్‌ యోజన పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరు గుతుందని కేంద్రవాణిజ్య పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ పర్కాష్‌ పేర్కొన్నారు.

త్వరలో బీజేపీ ప్రవాస్‌ యోజన
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ సహాయమంత్రి

 బూత్‌ స్థాయి వరకూ కేంద్ర పథకాలు వెళ్లాలి

 కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ  మంత్రి సోమ్‌ పర్కాష్‌

భానుగుడి(కాకినాడ), జూలై 5: రాష్ట్రంలో 8 లోక్‌సభ నియోజకవర్గ్గా పరిధిలో బీజేపీ గెలుపుకోసం పనిచేస్తుందని, అందుకు బీజేపీ లోక్‌సభ ప్రవాస్‌ యోజన పేరుతో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరు గుతుందని కేంద్రవాణిజ్య పరిశ్రమలశాఖ సహాయమంత్రి సోమ్‌ పర్కాష్‌ పేర్కొన్నారు. బీజేపీ లోక్‌సభ ప్రవాస్‌ యోజన జిల్లా ఇన్‌చార్జ్‌గా నియ మితులైన ఆయన మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కాకినాడకు వచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ బీజేపీ జిల్లా అఽధ్యక్షుడు చిలుకూరి రామ్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావే శంలో మంత్రి పర్కాష్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కాలం 18 నెలలు మాత్రమే ఉండడంతో రాష్ట్రంలో బీజేపీ బలోపేతం చేయడమే మా ముందున్న లక్ష్యమన్నారు. అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరుతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ పథ కాలను ప్రజలకు వివరిస్తున్నామని, ఇకపై నెలలో మూడు రోజులపాటు ప్రవాస్‌ యోజనలో భాగంగా బూత్‌స్థాయిలో పార్టీ కార్యకర్తలు సమా వేశమై పథకాలను కిందిస్థాయిలోకి వెళ్లేలా చేయడమే ప్రధాన లక్ష్యమ న్నారు. ఇప్పటికే గెజిటెడ్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించ డం జరిగిందని, కాకినాడ జిల్లాలో పర్యటనలు ప్రజలను కలుసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతీ ఒక్కరూ పనిచేయాల్సిందేనన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కేంద్ర కమిటీ సభ్యులు పాకా సత్యనారాయణ, కాళీరాజు, పార్టీ నేతలు వై మాలకొండయ్య, ముత్తా నవీన్‌, గండి కొండలరావు, అయ్యాజీవేమ, దొరబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-06T07:06:22+05:30 IST