గిరిజనుల తరఫున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ

ABN , First Publish Date - 2022-01-20T07:25:46+05:30 IST

రాష్ట్రంలో గిరిజనుల తరపున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరి నుంచీ సీఎం కేసీఆర్‌ గిరిజనులకు తీరని అన్యాయం చేశారని, దీనిపైన పోరాడే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. హైదరాబాద్‌లో బుధవారం..

గిరిజనుల తరఫున   పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ

 వారికి కేసీఆర్‌ తీరని అన్యాయం చేశారు: బండి సంజయ్‌ 

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గిరిజనుల తరపున పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సం జయ్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గరి నుంచీ సీఎం కేసీఆర్‌ గిరిజనులకు తీరని అన్యాయం చేశారని, దీనిపైన పోరాడే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. హైదరాబాద్‌లో బుధవారం మిషన్‌-12 పేరుతో ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల సమీక్షా సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో 12 ఎస్టీ నియోజకవర్గాల్లోనూ బీజేపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా బండి సంజయ్‌ అన్నారు. త్వరలోనే ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ.. 12 ఎస్టీ నియోజకవర్గాల్లో పర్యటిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు, పార్టీ నేతలు ఇంద్రసేనారెడ్డి, రవీంద్ర నాయక్‌, రమేశ్‌ రాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T07:25:46+05:30 IST