Karnataka: ఆపరేషన్ కమలం వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-09-13T16:42:08+05:30 IST

ఆపరేషన్ కమలంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ తాజాగా యూ టర్న్ తీసుకున్నారు...

Karnataka: ఆపరేషన్ కమలం వ్యాఖ్యలపై యూ టర్న్ తీసుకున్న బీజేపీ ఎమ్మెల్యే

బెంగళూరు: ఆపరేషన్ కమలంపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ తాజాగా యూ టర్న్ తీసుకున్నారు. గతంలో కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వీలుగా బీజేపీలో చేరేందుకు తనకు డబ్బు ఆఫర్ చేశారని, కాని తాను స్వచ్ఛందంగా బీజేపీలో చేరానని ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ వ్యాఖ్యానించారు.తాను కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరడానికి బీజేపీ డబ్బు ఇస్తామని చెప్పినా, తాను ఒక్క పైసా కూడా తీసుకోలేదని పాటిల్ చెప్పారు. అనంతరం పాటిల్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా వివరణ జారీ చేశారు. ‘‘నాకు బీజేపీ డబ్బు ఆఫర్ చేయలేదు. తన వ్యాఖ్యల్లో పదాలను తప్పుగా ఉపయోగించాను. నన్ను ఆకర్షించడానికి ఎవరూ ప్రయత్నించలేదు. సిద్ధాంతాల కారణంగా నేను స్వచ్ఛందంగా బీజేపీలోకి  వచ్చాను.’’ అని పాటిల్ వివరణ ఇచ్చారు. 


అంతకు ముందు బీజేపీ ఆపరేషన్ కమలంపై శ్రీమంత్ పాటిల్ నిజాలు చెప్పినందుకు అతన్ని అభినందిస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ చెప్పారు. పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ఏసీబీ తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శివకుమార్ డిమాండ్ చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేసి, 2019 లో బీజేపీలో చేరేందుకు పార్టీ మారిన హెచ్‌డి కుమారస్వామికి చెందిన కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వంలోని 16 మంది ఎమ్మెల్యేల్లో శ్రీమంత్ పాటిల్ ఒకరు.

Updated Date - 2021-09-13T16:42:08+05:30 IST